Politics
Bharat Ratna To PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ
Hazarath Reddyమాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. Xలో PM మోడీ ఇలా అన్నారు: "మన మాజీ ప్రధాన మంత్రి శ్రీ PV నరసింహారావు గారు భారతరత్నతో గౌరవించబడతారని పంచుకోవడం ఆనందంగా ఉంది.
Bharat Ratna To M.S.Swaminathan: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న, చాలా సంతోషంగా ఉందని తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyవ్యవసాయం, రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు
Telangana: తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్ర వ్యక్తి రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే తప్పేంటి? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంత బాధ, ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖ
Hazarath Reddyఅడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్రకు చెందిన రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బాధ ఐతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో 2,200 కేసులు వాదించారు. అందుకే నియమించామని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.
CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో గంటకు పైగా భేటీ అయిన సీఎం జగన్‌, ఏపీకి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్‌ సమావేశం కొనసాగింది. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చలు జరిపారు.
CM Jagan- Narendra Modi: ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం
Rudraప్రధాని మోదీతో (PM Modi) ఏపీ ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan) కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ సమావేశమవుతారు.
Andhra Pradesh Elections 2024: ఆసక్తికరంగా మారిన కందుకూరు రాజకీయాలు, వైసీపీలో చేరిన డాక్టర్ వంకి పెంచలయ్య, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దారెటు..
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య (Doctr Penchalaiah) బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
CM Jagan To Visit Delhi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం, నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రాత్రి జన్‌పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ ప్రకారం రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు
Telangana Politics: నేను హోం మంత్రి అయితే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అధిష్ఠానాన్ని హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నట్లు వెల్లడి
Hazarath Reddyతాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Konda Surekha vs Kavitha: మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కొండాసురేఖ
Hazarath Reddyటీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని,ఆయన్ని పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)తీవ్ర విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ కౌంటర్ (Konda Surekha vs Kavitha) విసిరారు.
Andhra Pradesh: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన జగన్ సర్కారు, వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లు ఖరారు చేసిన వైసీపీ అధిష్ఠానం
Hazarath Reddyరాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ తాజాగా ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు.
Janasena Glass Symbol Row: హైకోర్టుకు చేరిన జనసేన గాజు గ్లాసు గుర్తు పంచాయితీ, ఆ గుర్తు కోసం ముందుగా నేను దరఖాస్తు చేసుకున్నానని పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాస్
Hazarath Reddyజనసేకు గాజు గ్లాసును కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్‌(ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యూలర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమహేంద్రవరానికి చెందిన ఎం శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Baba Siddique Resigns Congress: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
NCP Sharadchandra Pawar: శరద్‌ పవార్‌‌ వర్గానికి షాకిచ్చిన ఈసీ, అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్‌ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. శరద్‌ పవార్‌‌కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్‌సీపీ శరద్‌ చంద్రపవార్‌ పార్టీగా నామకరణం చేసింది.
Uniform Civil Code Bill: యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, యూసీసీ బిల్లును అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఉత్తరాఖండ్
Hazarath Reddyముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును సభలో ఆమోదించారు. అసెంబ్లీలో UCC బిల్లును ఆమోదించిన తర్వాత, ఉత్తరాఖండ్ దేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది.
Tamil Nadu Elections 2024: తమిళనాడులో బీజేపీకి బిగ్ బూస్టింగ్, కాషాయం తీర్థం పుచ్చుకున్న 15 మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో మాజీ ఎంపీ
Hazarath Reddyలోక్ సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)కు చెందిన పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు.
Delhi Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు, ఈ నెల 17న ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు, 5 సార్లు డుమ్మా కొట్టిన ముఖ్యమంత్రి
Hazarath Reddyమద్యం పాలసీ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న ఈడీ ముందు హాజరు కావాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.
Parliament Budget Session 2024: కాంగ్రెస్‌ ఔట్‌డేటెడ్‌.. 40 సీట్లు కూడా రావంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి వివక్షలేదని వెల్లడి
Hazarath Reddyకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా (Congress gave him new startup) తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆయన కనీసం దేన్నీ స్టార్ట్‌ చేయడు’’ అని ఎద్దేవా చేశారు.
Babu Mohan Resigns BJP: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా, నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదని ఆవేదన
Hazarath Reddyబీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
AP Vote on Account Budget Today: నేడు ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. మొత్తం బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా
Rudra2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Ra Kadali Ra Meeting in GD Nellore: వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు, గంగాధర నెల్లూరు రా.. కదలిరా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ
Hazarath Reddyచిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటుచేసిన ‘రా.. కదలిరా’ సభ వేదికగా సీఎం జగన్ మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.