Politics
Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది.
Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఏడు స్థానాలను నిలుపుకున్న ఎంఐఎం, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తగ్గిపోయిన ఓటు బ్యాంకు
Hazarath Reddyఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అసెంబ్లీలో తన ఏడు స్థానాలను నిలుపుకుంది. రెండు సీట్లలో ఓడిపోయింది. అలాగే సాంప్రదాయక కోటలో ఆ పార్టీకి ఓట్ల శాతం కూడా తగ్గింది. ఎఐఎంఐఎం అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించగా, మరో ఐదు సెగ్మెంట్‌లను మెజారిటీతో నిలబెట్టుకున్నారు.
Kamareddy Result: గత సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డిలను సాధారణ ప్రత్యర్థులుగానే చూశా.. కామారెడ్డి వీరుడు వెంకటరమణారెడ్డి స్పందన ఇది..
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం కామారెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి.. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.
TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే
Rudraతెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌ కు తెలియజేస్తారు.
KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
Mizoram Election Counting LIVE: మిజోరంలో కౌంటింగ్ ప్రారంభం.. ఎమ్ఎన్ఎఫ్, జెడ్‌పీఎమ్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ.. జెడ్‌పీఎమ్ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా
Rudraఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణతో పాటూ మిజోరంలో కూడా నిన్ననే కౌంటింగ్ జరగాల్సి ఉండగా ఈసీ కౌంటింగ్‌ను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Rajasthan Assembly Election Results 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం, ఫలితాలు షాక్‌కు గురిచేశాయని తెలిపిన సీఎం అశోక్ గెహ్లాట్
Hazarath Reddyరాజ‌స్తాన్ ఎన్నిక‌ల ఫ‌లితాలపై తాజాగా రాష్ట్ర ముఖ్య‌మంతి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఫ‌లితాలు త‌మ‌కు నిరాశ‌కు గురిచేశాయ‌ని అన్నారు.ఫ‌లితాల వెలువ‌డుతున్న క్ర‌మంలో గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఫ‌లితాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
Telangana Election Results 2023: గజ్వేల్‌లో 45,174 ఓట్ల తేడాతో ఈటెల రాజేందర్‌పై ఘన విజయం, మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి
Hazarath Reddyఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్‌పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Telangana Election Results 2023: తెలంగాణలో 8 సీట్లను కైవసం చేసుకుని పుంజుకున్న బీజేపీ, కమలం గెలిచిన స్థానాలు ఇవే..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎంపీల్లో సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ ఓటమి పాలయ్యారు
Telangana Election Results 2023: ఓటమి ఎరుగని ఎర్రబెల్లి దయాకర్‌రావును మట్టికరిపించిన కాంగ్రెస్‌ అభ్యర్థి య‌శ‌స్విని రెడ్డి, కొండా సురేఖ చేతిలో ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావు ఓటమి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సోదరుడు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్‌ఎస్‌ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా మరోసారి బరిలోకి దిగారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌ రావు వరంగల్‌ ఈస్ట్‌ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు.
Telangana Election Results 2023: మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా, బర్రెలక్క సంచలన నిర్ణయం, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు విజయం
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యధిక సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. అయితే కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
Telangana Election Results 2023: రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.
Telangana Election Results 2023: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, OSD ద్వారా రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసైకి పంపించిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కేవలం రెండు వాహనాల్లోనే రాజ్‌భవన్‌కు చేరుకుని కేసీఆర్ రిజైన్ లెటర్‌ను అందించారు.తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
PM Modi on Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ, తెలంగాణతో మా బంధం విడదీయరానిదంటూ ట్వీట్
Hazarath Reddyనా ప్రియమైన తెలంగాణా సోదరులారా..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ మద్దతు పెరుగుతోంది మరియు రాబోయే కాలంలో కూడా ఈ ధోరణి కొనసాగుతుంది.తెలంగాణతో మా బంధం విడదీయరానిదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం.ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.
PM Modi on Election Results 2023: మనం భారత్‌ను గెలిపించాలి, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ
Hazarath Reddyమధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు.
Telangana Election Results 2023: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం
Hazarath Reddyకామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు.
Telangana Elections Winning Candidates List: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మొత్తం లిస్టు ఇదిగో, హైదరాబాద్‌లో మెజార్టీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకున్నదంటే..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది.
Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్, విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ..
Hazarath Reddyమంత్రి కేటీఆర్ ఫలితాలపై ట్వీట్ చేశారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ మేము దీన్ని ఒక అభ్యాసంగా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Telangana Election Results 2023: గోషామహల్‌లో రాజాసింగ్ ఘన విజయం, వరుసగా హ్యట్రిక్ కొట్టిన బీజేపీ నేత, అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ లో తన ఖాతాను తెరిచింది. గోషా మహల్ నుంచి రాజా సింగ్ ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఘన విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
Telangana Election Results 2023: ఆర్మూరు నుంచి బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఘన విజయం, మూడవస్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు.