Politics
Bail Granted for Babu: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు
Rudraస్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు, నవంబర్‌ 2న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 2న విచారణకు హాజరుకావాలని నోటీసులు కోరింది. లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Maratha Quota Issue: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు షాక్, మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు ఎంపీలు రాజీనామా
Hazarath Reddyమహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు.
Kasani Gnaneshwar Resigns: తెలంగాణ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్, పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే టీడీపీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని తెలిపారు.
Telangana Assembly Elections 2023: బీఎస్పీ సంచలనం, తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ ఇచ్చిన బీఎస్పీ, 43 మందితో రెండో జాబితా విడుదల
Hazarath Reddyత్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ను బీఎస్పీ పార్టీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ... తాజాగా మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, మేం అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేసే ముస్లిం రిజర్వేషన్లను మొదటి కేబినెట్‌లోనే రద్దు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.
Telangana Assembly Elections 2023: కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలుస్తున్నాం, ఆరు అంశాలతో మద్దతు ప్రకటించిన కోదండరాం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో భేటీ అనంతరం ఆయన వారితో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, పాల్వాయి స్రవంతిని నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి, మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించిన హైకమాండ్
Hazarath Reddyగత ఏడాది మునుగోడు ఉపఎన్నికల్లో స్రవంతికి రేవంత్ ఇచ్చిన వాగ్ధానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయిస్తామని.. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రచార సభ వేదికగా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
Telangana Elections 2023: జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరణతో పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం, బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వార్నింగ్..
ahanaజూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో విష్ణు ఆగ్రహంతో ఉన్నారు.
Candidate On Donkey: గాడిదపై వెళ్లి నామినేషన్‌ వేసిన అభ్యర్థి.. మధ్యప్రదేశ్‌ లో జరిగిన ఈ వింత చర్య వెనుక గొప్ప కారణమే ఉంది.. అసలేంటీ సంగతి?? (వీడియోతో)
Rudraసాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు కార్లలోనో, ట్రాక్టర్‌లలోనో, బైకులపైనో అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్తారు. కానీ,
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 45 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల, అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాలో బోథ్ నుంచి వెన్నెల అశోక్, ముథోల్ నుంచి నారాయణ్ రావు, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి మధన్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్ పోటీ చేయనున్నారు.
Amit Shah on Telangana CM: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన
Hazarath Reddyతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు.
Telangana Assembly Elections 2023: మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి
Hazarath Reddyఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.
Telangana Assembly Elections 2023: ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఏపీ మిథున్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.
Gorantla Madhav on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు 2024లో చస్తారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు, టీడీపీ శ్రేణుల్లో కలకలం
Hazarath Reddyహిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు.
Indore Viral News: 18 సార్లు డిపాజిట్‌ రాకపోయినా మళ్లీ పోటీ చేస్తున్నాడు.. ఇండోరి ధార్తి పకడ్‌ గురించి తెలుసుకోండి మరి..
Rudraమధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ కు చెందిన పరమానంద్‌ తొలాని అలియాస్‌ ఇండోరి ధార్తి పకడ్‌ ది ఆసక్తికరమైన ఉదంతం.
One Nation One Election: జమిలికి 30 లక్షల ఈవీఎంలు అవసరం.. సన్నద్దతకు 1.5 ఏండ్లు కావాలి.. రోడ్‌మ్యాప్‌ లో లా కమిషన్‌ వెల్లడి
Rudraజమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి సుమారు 30 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని, సన్నద్ధతకు ఏడాదిన్నర సమయం అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
TS Police Seized: తెలంగాణలో ఎన్నికల తనిఖీలు.. పెద్దయెత్తున నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం స్వాధీనం.. ఇప్పటివరకు రూ.347 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.