Politics

Rahul Gandhi's Disqualification: ఈ రోజు భారత ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే, రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ( PM Modi ) పాల‌న ఎమ‌ర్జెన్సీ( Emergency )ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

Four YCP MLAs Suspended: ఆ నలుగురికి షాక్, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సీఎం జగన్, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధించినట్లు తెలిపిన సజ్జల

Hazarath Reddy

ఏపీ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు

Mekapati on Cross Voting: వీడియో ఇదిగో, నేను వైసీపీకే ఓటు వేశానని తెలిపిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వెల్లడించిన ఉదయగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని చెప్పారు. తన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు

Mekapati Chandrasekhar Reddy: మీడియా ముందుకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నేను వైసీపీకే ఓటు వేశాను, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వెల్లడించిన ఉదయగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని చెప్పారు. తన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు. ఓటు వేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చానని తెలిపారు.

Advertisement

Rahul Gandhi's Disqualification As MP: రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అసలు మోదీ ఇంటిపేరు వివాదం ఏమిటీ, పరువు నష్టం దావా ఎవరు వేశారు, రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ ఏమన్నారు ?

Hazarath Reddy

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి షాక్‌ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్‌సభ సెక్రటేరియెట్‌. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

AP Budget 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, అసెంబ్లీలో కనిపించని ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ శిబిరంలో బలపడుతున్న అనుమానాలు

Hazarath Reddy

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)లు శాసనసభలో కనిపించలేదు.

AP Budget 2023: స్పీకర్ రూలింగ్‌కు వ్యతిరేకంగా రెడ్ లైన్ క్రాస్, 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, 9వ రోజు కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

Hazarath Reddy

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్‌ చేశారు. స్పీకర్‌ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు

Revanth Reddy House Arrest: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదన్న పోలీసులు, దీక్ష జరిగి తీరుతుందని స్పష్టం చేసిన ఓయూ విద్యార్థులు

Hazarath Reddy

రేవంత్ రెడ్డి మహాదీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

AP MLC Election Result: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.

AP MLC Election Result 2023: 23 సీట్లని ఎద్దేవా చేశావు, అదే 23వ తేదీన‌ అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి మా గెలుపు ప్రారంభం, ముఖ్యమంత్రి జగన్‌పై సెటైర్లు వేసిన నారా లోకేష్

Hazarath Reddy

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుని సత్తా చాటింది. తగినంత బలం లేకపోయినా పంచుమర్తి అనురాధను చంద్రబాబు ఎన్నికల బరిలోకి దించారు. ఆయన వ్యూహాలు ఫలించి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ విజయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

AP MLC Election Result 2023: టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్లేనా, ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి అనురాధ గెలుపు, 5 స్థానాల్లో గెలిచిన వైసీపీ, ఒక స్థానానికి జరుగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఏపీలో మ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. కాగా వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది

AP MLC Polls 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Cota MLC Elections) కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

AP MCL Polls 2023: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించుకున్న 172 మంది ఎమ్మెల్యేలు, బలం లేకున్నా అభ్యర్థులను నిలిపిన టీడీపీ

Hazarath Reddy

ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 9 గంటలకు పోలింగ్‌ (AP MCL Polls 2023) ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Rahul Gandhi Guilty: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, 2019 కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్‌ కోర్టు

Hazarath Reddy

గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించింది.

SM Krishna Receives Padma Vibhushan: పద్మవిభూషణ్ అందుకున్న కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, పబ్లిక్ అఫైర్స్ విభాగంలో అవార్డు ప్రకటించిన కేంద్రం

Hazarath Reddy

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ పద్మవిభూషణ్ అందుకున్నారు. పబ్లిక్ అఫైర్స్ విభాగంలో సీనియర్ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు ఈ అవార్డును ప్రకటించింది

KTR on Chetan Arrest: సీఎంను, మంత్రులను బూతులు తిడుతున్నా మేము సహిస్తున్నాం, బెంగుళూరులో నటుడు చేతన్ అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లో ప‌రుష ప‌దాల‌తో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నార‌ని బీఆర్ఎస్( BRS Party ) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు

Advertisement

PM Modi to Visit Varanasi: మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన, వన్ వరల్డ్ టీబీ సమ్మిట్‌లో ప్రసంగించనున్న భారత ప్రధాని

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 24న వారణాసిలో పర్యటించనున్నారు. రుద్రకాష్ కన్వెన్షన్ సెంటర్‌లో వన్ వరల్డ్ టీబీ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో రూ.1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

Delhi Excise Case: సిసోడియా కస్టడీ ఏప్రిల్‌ 5వ తేదీ వరకు పొడిగింపు, నా భార్య అనారోగ్యంతో ఉన్నారని, ఆమెను చూసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌

Hazarath Reddy

మద్యం పాలసీ కేసు (Liquor Policy Case) లో అరెస్టైన ఆప్‌ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్‌ కస్టడీ (Judicial Custody)ని కోర్టు మరోసారి పొడిగించింది. సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ (Judicial Custody) విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

Japanese PM Tries Golgappe With PM Modi: వీడియో ఇదిగో, భారత్ పానీ పూరీకి ఫిదా అయిన జపాన్ ప్రధాని, ఇంకొకటి అంటూ అడిగీ మరీ ప్రధాని మోదీతో కలిసి లాగించిన ప్యుమియో కిషిదా

Hazarath Reddy

పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్‌లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్‌ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్‌గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది.

Farmers Protest Row: కనీస మద్దతు ధరపై రైతులకు హమీ ఇవ్వని కేంద్రం, కిసాన్ ఆందోళన్ 2.0కు రెడీ అవుతున్న రైతు సంఘాలు

Hazarath Reddy

పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరోసారి భారీ ఎత్తున నిరసనలకు (‘కిసాన్ ఆందోళన్ 2.0’) రైతులు సన్నద్ధమవుతున్నారు.ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం ‘కిసాన్ మహాపంచాయత్‌’ జరిగింది.

Advertisement
Advertisement