Politics

AP Budget Session 2023-24: అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, అసెంబ్లీలో గవర్నర్ నజీర్ తొలి ప్రసంగం, ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి.

Video: శివ‌సేన ఎమ్మెల్యే ముద్దు వీడియో వైరల్, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు, నన్ను అభాసుపాలు చేసేందుకే ఈ పనంటూ పార్టీ ప్ర‌తినిధి శీత‌ల్ మాత్రే ఆవేదన

Hazarath Reddy

ఆశీర్వాద్ యాత్ర సంద‌ర్భంగా మ‌హారాష్ట్ర‌లోని ద‌హిస‌ర్‌లో శివ‌సేన ఎమ్మెల్యే ప్ర‌కాష్ స‌ర్వె (షిండే వ‌ర్గం) పార్టీ ప్ర‌తినిధి శీత‌ల్ మాత్రే ముద్దుపెట్టుకున్న వీడియో వైర‌ల్‌గా మారింది. ఎమ్మెల్యే ప్ర‌తిష్ట‌ను దిగజార్చేందుకే మార్ఫింగ్‌ వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నార‌ని ప్ర‌కాష్ కుటుంస‌భ్యుల ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Congress Targets PM Modi: నాటు నాటు కాదు లూటో లూటో, ప్రధాని మోదీ, అదానీల ఫోటోలతో కాంగ్రెస్ పార్టీ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, పారిశ్రామిక దిగ్గ‌జం గౌతం అదానీల‌ను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress) నాటు నాటు సాంగ్ సంద‌ర్భాన్ని వాడుకుంది.ఈ పాట‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల ఇమేజ్‌ల స్ధానంలో మోదీ అదానీల ఫొటోల‌ను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో (దోచుకో) ప‌దాల‌తో మార్చింది.

MLC Election 2023: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మూడు గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది

Advertisement

Perni Nani on Pawan Kalyan: కులాలపై కనీస అవగాహన లేని సన్నాసి పవన్‌, మరో ఏడాదిలో అన్ని రంగులు బయటపడతాయని పేర్ని నాని విమర్శలు

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పేర్నినాని మరోసారి విరుచుకుపడ్డారు. కాపులందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ ఎంతో చేశారని, అందుకే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు.

AP Budget 2023-24: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, ఈ నెల 18న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ 2023-24 సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, మండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి.

Delhi Liquor Scam: హైదరాబాద్ చేరుకున్న కవిత.. విచారణ వివరాలను కేసీఆర్‎తో చర్చించే అవకాశం?!

Rudra

ఈడీ విచారణ అనంతరం కవిత ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. నేడు ప్రగతి భవన్‎కు వెళ్లి సీఎం కేసీఆర్‎ను కలవనున్నట్లు సమాచారం.

Delhi Excise Policy Case: మనీశ్‌ సిసోడియాకు ఎదురుదెబ్బ, మార్చి 17 వరకు ఈడీ కస్టడీ పొడిగించించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు, సీబీఐ రిమాండ్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case)లో అరెస్టైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ( former Delhi Deputy Chief Minister) మనీశ్‌ సిసోడియా(Manish Sisodia)కు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ (CBI) రౌజ్ ఎవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) వారం రోజుల పాటు సిసోడియా ఈడీ కస్టడీ పొడిగించింది.

Advertisement

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, ఎంపీ అవినాష్ రెడ్డిపై అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్‌ డిస్క్‌ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Temple Attacks Issue in Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడి, భారతీయ కమ్యూనిటీలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆసీస్ ప్రధాని ధాని అల్బనీస్‌

Hazarath Reddy

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల విధ్వంసం గురించి ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయ కమ్యునిటీలకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Online Gambling: తమిళనాడులో ఆన్‌లైన్ రమ్మీ నిషేధం, బిల్లును తిరస్కరించి సభకు పంపిన గవర్నర్, సవరణలతో రావాలని సూచించిన రాజ్‌భవన్

Hazarath Reddy

తమిళనాడులో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాలని స్టాలిన్ ప్రభుత్వం పంపిన బిల్లును (Bill banning online Rummy) గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిరస్కరించారు. ఆన్‌లైన్ రమ్మీని నిషేధించే బిల్లును తమిళనాడు అసెంబ్లీకి పునఃపరిశీలన కోసం రాజ్ భవన్ తిరిగి పంపినట్లు (rejected by Governor RN Ravi ) అధికారిక వర్గాలు బుధవారం ఇక్కడ తెలిపాయి.

Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనిష్‌ సిసోడియా మళ్లీ అరెస్ట్, ఈ సారి అరెస్ట్ చేసింది ఈడీ, నేడు కోర్టులో విచారణకు రానున్న సిసోడియా బెయల్ పిటిషన్

Hazarath Reddy

ఢిల్లీ మద్యం స్కాం కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్‌ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు (Manish Sisodia Arrested) చేసినట్లు ప్రకటించింది.

Advertisement

Love Jihad Cases in Maharashtra: మహారాష్ట్రలో లక్షకు పైగా ల‌వ్ జిహాదీ కేసులు, అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మంగ‌ల్ ప్ర‌భాత్ లోధా

Hazarath Reddy

మహారాష్ట్ర మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మంగ‌ల్ ప్ర‌భాత్ లోధా(Mangal Prabhat Lodha) సంచలన వ్యాఖ్యలు చేశారు.మహాలో ల‌క్ష‌కు పైగా ల‌వ్ జిహాదీ కేసులు ఉన్న‌ట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో లోధా మాట్లాడుతూ.. శ్ర‌ద్ధా వాల్క‌ర్ లాంటి కేసులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు.

Delhi Liquor Scam Case: న‌వంబ‌ర్, డిసెంబ‌ర్‌లో తెలంగాణ‌ ఎన్నిక‌లు, కీలక వ్యాఖ్యలు చేసిన కవిత, ఈడీ విచార‌ణ‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడి

Hazarath Reddy

ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్‌ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. ఈడీ( ED Notice ) విచార‌ణ‌కు వంద‌ శాతం స‌హ‌క‌రిస్తాను..

MLA Silpa Chakrapani Reddy: జగన్‌ను వీడేది లేదు, టీడీపీలో చేరుతారనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

Hazarath Reddy

ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. నేతలు పార్టీ మార్పుపై జోరుగా ఊహగానాలు వస్తున్నాయి. తాజాగా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చక్రపాణిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అబద్ధాలను పదేపదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు.

Tamil Nadu Politics: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్, కాషాయన్ని వీడి AIADMK తీర్థం పుచుకున్న 13 మంది నేతలు, అందరూ ఐటీ వింగ్‌కు చెందినవారే..

Hazarath Reddy

తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ పార్టీకి గుడ్‌బై (Bjp Leader Quits) చెప్పారు. వాళ్లంతా బీజేపీని వీడి దాని మిత్రపక్షమైన అన్నా డీఎంకేలోనే చేరారు

Advertisement

Manik Saha Takes Oath as CM: త్రిపుర ముఖ్యమంత్రిగా రెండవసారి డాక్టర్‌ మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం, హాజరైన బీజేపీ ప్రముఖులు

Hazarath Reddy

త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్‌ మాణిక్‌ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్‌లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. కాగా, మాణిక్‌ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి.

Telangana MLC Polls 2023: తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే, రచయిత దేశ‌ప‌తి శ్రీనివాస్‌కు అవ‌కాశం కల్పించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 9న అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్‌ వేయనున్నారు.

Meghalaya, Nagaland Government Formation: మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు, సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన కాన్రాడ్‌ సంగ్మా, నీఫియా రియో

Hazarath Reddy

మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. నాగాలాండ్‌, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్‌డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన కాన్రాడ్‌ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

Nalin Kateel: పిల్లలు పుట్టరని తెలిసే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు.. బీజేపీ ఎంపీ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్, సిద్ధరామయ్య ప్రచారం చేశారని మండిపాటు

Rudra

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ కర్ణాటక చీఫ్ నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా దాడి చేశారు. ఒకానొక స్థాయిలో పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement