రాజకీయాలు
BJP MLA Madan Dilawar-CAA Row: సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోండి, లేకుంటే హిందూ మహ సముద్రంలో దూకండి, మీరంతా దేశానికి శత్రువులే, రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)(Citizenship Amendment Act) వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ (BJP MLA Madan Dilawar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
'MAHA' Stalemate: ‘మహా’లో మొదలైన ముసలం, ఎన్సీపీ ఎమ్మెల్యే రాజీనామాస్త్రం, నేను రాజకీయాలకు పనికిరానన్న ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి, క్యాబినెట్ పదవుల విస్తరణ జరిగిన మరుసటి రోజే సంచలన నిర్ణయం, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించని సంజయ్ రౌత్
Hazarath Reddyమహా రాజకీయాల్లో అప్పుడే ముసలం మొదలైంది. క్యాబినెట్ విస్తరణ జరిగిన మరుసటి రొజే నేతల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ రాజీనామాస్త్రం. రాజకీయాలకు తాను పనికిరానంటూ మహారాష్ట్రకు(Maharashtra) చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ (Ncp Mla Prakash Solanki) ప్రకటించడమేకాక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా(Solanki Announces Resignation) చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.
AP Capital Issue-HC Comments: రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం, ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే పిటిషన్‌పై స్పందిస్తాం, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాజధానిపై (AP Capital)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం (AP GOVT) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఈ పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Karimnagar as London: కాళేశ్వరం పూర్తైతే కరీంనగర్ లండన్‌లా మారుతుంది. ఈ విషయం అర్థంకాకే వక్రభాష్యాలు, కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్, రాష్ట్రానికి ఏం కావాలో తమ ప్రభుత్వానికే పూర్తి అవగాహన ఉందని వెల్లడి
Vikas Mandaజూన్ లోగా మానేరు, మూలవాగు చెక్ డ్యాంలు నీటితో నింపుకోవాలి. లండన్ నగరంలో థేమ్స్ నది ఎలాగైతే సజీవంగా ఉంటుందో మానేరు నది కూడా అలాగే ఉంటుంది. తాను గతంలో ఈ విషయం చెబితే కొందరు సన్నాసులు అర్థంకాక వెకిలి నవ్వులు నవ్వారు, వక్ర భాష్యాలు చెప్పారు. జూన్ నెల తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు....
AP Political Row: అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, ఏపీ సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేసారంటూ విమర్శలు
Hazarath Reddyతెలుగుదేశంపార్టీ(TDP) ఏపీ రాజధాని మార్పు (AP Capital Change) అంశం మీద అధికార పార్టీపై (YSRCP)నివురు గప్పిన నిప్పులా మండిపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇవేమి పట్టని టీడీపీ ఎమ్మెల్యే (Guntur West TDP MLA)నేరుగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద పొగడ్తల వర్షం కురిపించారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కలయిక తరువాత ఎమ్మెల్యే గిరి (Maddali Giridhara Rao) సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
Sand Door Delivery In AP: ఇకపై ఇసుక నేరుగా మీ ఇంటికే, ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు, జనవరి 20 నాటికి అన్ని జిల్లాలకు డోర్‌ డెలివరీ
Hazarath Reddyఇసుకను సామాన్యలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం (AP GOVT) మరో ముందడుగు వేసింది. ఇక నుంచి ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ (Sand Door Delivery In AP) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో (Krishna District) పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు జరపనుంది. జనవరి 7న తూర్పుగోదావరి, (East Godavari) వైఎస్సార్‌ కడప (YSR Kadapa) జిల్లాల్లో డోర్‌ డెలివరీ చేయనున్నారు.
Bipin Rawat: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన కేంద్రం, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకం, 65 ఏళ్లు వచ్చేవరకు పదవిలో బిపిన్ రావత్, ఆయన బాధ్యతలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఇండియా మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను(Army chief General Bipin Rawat) కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Ajit Pawar Is Back As Dy CM : రెండోసారి డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మహారాష్ట్రలో కొలువుతీరిన పూర్తి స్థాయి ప్రభుత్వం, మంత్రి పదవులు దక్కించుకున్న ఆదిత్య ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్
Hazarath Reddyమహారాష్ట్రలో (Maharashtra) పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువు తీరింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (Chief Minister of Maharashtra) ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ‘మహా’లో పూర్తి స్థాయి ప్రభుత్వం ( Uddhav Thackeray-led cabinet) కొలువు తీరింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ( Uddhav Thackeray) నేతృత్వంలోని కేబినెట్‌లో కొత్తగా 36 మంది మంత్రులకు చోటుదక్కింది.
#IndiaSupportsCAA: ముల్లును ముల్లుతోనే! పౌరసత్వ సవరణ చట్టంపై సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ, దేశ పౌరులు #IndiaSupportsCAA హాష్‌టాగ్‌ వాడుతూ సిఎఎకు సోషల్ మీడియాలో మద్ధతు తెలపాలని కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
Vikas MandaCAAకు వ్యతిరేకంగా వ్యాప్తి చెందుతున్న పుకార్లను నియంత్రించడానికి బీజేపీ 'జాన్ జాగ్రాన్ అభియాన్' కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సహాయంతో, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోదీ సర్కార్ దేశంలో సిఎఎ ప్రవేశపెట్టిందనే సందేశాన్ని వ్యాప్తి చేయనుంది. సిఎఎ భారత్ లాంటి దేశానికి ఎంత ముఖ్యమైన చట్టమో చెబుతూ....
Anti-CAA Rangoli Row: తమిళనాడులో కొత్త తరహా నిరసన, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు, తమిళనాడు అగ్ర నేతల ఇంటి ముందు సీఏఏకి వ్యతిరేకమంటూ రంగోలి స్లోగన్స్, కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
Hazarath Reddyసీఏఏ, (CAA)ఎన్ఆర్‌సీలకు(NRC) వ్యతిరేకంగా (Tamil Nadu) తమిళనాడులో కొత్త తరహా నిరసనలు ఊపందుకున్నాయి. మొన్నమహిళలు సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు (Rangoli) వేసినందుకు వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎంపీ కనిమెళి(DMK MP Kanimozhi) ఇంటి బయట ఈ ముగ్గులు దర్శనమిస్తున్నాయి.
Visakha Utsav 2019-Highlights: ముగిసిన విశాఖ ఉత్సవ్, మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం, ఎక్కడా వ్యతిరేకత కానరాని వైనం, పూల వర్షం ద్వారా ప్రతిపక్షాలకు ఝలక్, ఈ విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?
Hazarath Reddyఅశేష జనసందోహం హర్షాతిరేకాల మధ్య విశేష కార్యక్రమాల మేళవింపుతో విశాఖ ఉత్సవ్‌ (Visakha Utsav 2019)ఘనంగా ముగిసింది. ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌(Daggubati Venkatesh), సినీ నేపధ్య గాయకులు గీతామాధురి, సింహా, ఆదిత్య , వెంకీ మామ డైరెక్టర్‌ బాబీ, సినీ సంగీత దర్శకుడు థమన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమ (Anchor Sma) వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. విశాఖ వాసులు అశేషంగా తరలిరావడంతో బీచ్‌ రోడ్‌ కిక్కిరిసిపోయింది.
Jharkhand CM Swearing-in Ceremony: జార్ఖండ్ పీఠంపై హేమంత్ సోరెన్, 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ప్రతిపక్షాల ఐక్యతతో దద్దరిల్లిన సభా ప్రాంగణం, హాజరయిన ప్రముఖులు
Hazarath Reddyజార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం (Hemant Soren Takes Oath As Jharkhand CM) చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్మా (Governor Draupadi Murmu) ఆయనచే ప్రమాణం చేయించారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్ (Hemant Soren) బాధ్యతలు స్వీకరించారు.
Harish Rao: మూడు రాజధానుల అంశంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు, పిల్లల చదువుపై తీవ్ర అసంతృప్తి, పదో ఎక్కమే చెప్పలేని వాళ్లు పది ఎలా పాసవుతారన్న మంత్రి, విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెలంగాణకు కలిసి వస్తుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ప్రస్తుతం ఏపీ (AP)రాష్ట్రంలో రాజధానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ (Telangana) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కలిసి వస్తాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ (Real Estate)రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని అన్నారు.
AP Capital Shifting Row: ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం, బుగ్గన నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైవపర్ కమిటీ, ఫిబ్రవరి 1న కీలక ప్రకటన వచ్చే అవకాశం, ఇన్‌సైడర్ ట్రైడింగ్‌పై కొనసాగుతోన్న వార్
Hazarath Reddyఏపీలో (AP) మూడు రాజధానుల అంశంపై ( 3 Capital Issue) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.మొత్తం 16 మంది సభ్యులతో రాజధానిపై హైపవర్ కమిటీని (High Power Committee) ఏర్పాటు చేసింది. పేర్నినాని, మోపిదేవి వెంకట రమణ, మేకపాటి సుచరిత, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, డీజీజీ గౌతమ్ సవాంగ్,బుగ్గన, పేర్ని నాని, కొడాలినాని, అజయ్ కల్లం, గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.
Tiranga Rally: సీపీ క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ మండిపడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకోమంటూ వార్నింగ్ ఇచ్చిన తలసాని, మాటల తూటాలతో సాగిన కాంగ్రెస్ తిరంగా ర్యాలీ, గవర్నర్‌ను కలవనున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం( Congress 135th Foundation Day)సందర్భంగా టీ-కాంగ్రెస్ పార్టీ (Telangana Congress)తలపెట్టిన తిరంగా ర్యాలీలో (Tiranga Rally)మాటల తూటాలు పేలాయి. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ భవన్‌లోనే (Gandhi Bhavan) తెలంగాణా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
Bomb Blast At Tirupati: తిరుపతిలో బాంబు పేలుడు, ఉలిక్కిపడ్డ ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పేలిన బాంబు, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
Hazarath Reddyప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (Tirupati) బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలుడు (Bomb blast at Tirupati government hospital) జరిగింది. కాగా నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు (Dogs)లాక్కెళ్లడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
Visakha Utsav 2019: రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, రాజధానిపై ఆచితూచి అడుగులు, విశాఖ ఉత్సవ్ 2019పై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Andhra Pradesh Chief Minister YS Jagan) బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు(Visakhapatnam) వెళ్లారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురుకాగా.. ఈసారి విశాఖవాసులు పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి (Chief Minister)సాదరస్వాగతం పలికారు.
Priyanka Gandhi Heckling Row: పోలీసులపై మండి పడిన ప్రియాంక గాంధీ, గొంతు పట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దంటున్న పోలీసులు, అసలేం జరిగింది ?
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra)లక్నో పోలీసులపై ఫిర్యాదు చేశారు. తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని(Priyanka Gandhi Heckling Row) ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు.ఈ వ్యాఖ్యలను లక్నో ఎస్ఎస్పి కలానిధి నైతిని (Kalanidhi Naithini) ఖండించారు. ప్రియాంక గాంధీ గొంతును పోలీసులు పట్టుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.
Hemant Soren: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్, నేడు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం, రాలేనన్న ప్రధాని, హాజరవ్వనున్న ప్రముఖులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
Hazarath Reddyజార్ఖండ్‌ 11వ సీఎంగా జేఎమ్ఎమ్ అధినేత హేమంత్‌ సొరేన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్‌ సొరేన్‌‌తో గవర్నర్ ద్రౌపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హేమంత్‌ సోరెన్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.
Rahul Gandhi Attacks BJP: చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు అస్సాంలో సాగవు, నాగపూర్ పాలన కుదరదు, అస్సాంలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ, అస్సాంను అస్సామీలే పరిపాలిస్తారంటున్న కాంగ్రెస్ నేత
Hazarath Reddyఅస్సాంలో బీజేపీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిప్పులు (Rahul Gandhi Attacks BJP) చెరిగారు. దేశ విభజనే ప్రధాన ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇవాళ గౌహతిలో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ...బీజేపీ (BJP)ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందన్నారు. ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్‌ (Rajul Gandhi) ప్రశ్నించారు. ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదని మండి పడ్డారు.