రాజకీయాలు
YS Jagan's Security Row: భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతన భద్రతా కుదింపుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్ జనరల్ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు.
National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.
AP Cabinet Meeting: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు, చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
Hazarath Reddyస్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
AP Cabinet Meeting Highlights: పట్టాదారు పాసు పుస్తకాల నుండి జగన్ ఫోటో ఔట్, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ
Hazarath Reddyసర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూశాఖ నోట్ సమర్పించింది.
AP Cabinet Meeting Highlights: మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్ సమావేశం హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.
Rajya Sabha Elections: సెప్టెంబర్ 3న 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
Hazarath Reddyకేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ 12 స్థానాల్లో 10 చోట్ల రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు, ఇటీవలి ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు వెళ్లారు. దాంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.
Vinesh Phogat Disqualified: పార్లమెంట్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు ప్రకంపనలు, ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
Vinesh Phogat Disqualified: అక్కడ ఏదో జరిగింది, 50-100 గ్రాముల అధిక బరువు ఉంటే అనుమతిస్తారు, తదుపరి ఒలింపిక్స్‌కు వినేష్‌ను సిద్ధం చేస్తానని తెలిపిన ఫోగట్ మేనమామ
Hazarath Reddyనేను చెప్పడానికి ఏమీ లేదు. దేశం మొత్తం బంగారం ఆశించింది... నియమాలు ఉన్నాయి కానీ ఒక రెజ్లర్ 50-100 గ్రాముల అధిక బరువు కలిగి ఉంటే, వారు సాధారణంగా అనుమతించబడతారు. ఆడండి, నిరాశ చెందవద్దని నేను దేశ ప్రజలను అడుగుతాను
Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.
YouTube Academy in Andhra Pradesh: అమరావతిలో యూట్యూబ్ అకాడమీ, ఎక్స్ వేదికగా ప్రకటించిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
YS Jagan Slams CM Chandrababu: ఈ దాడులు ఆపకపోతే రేపు మా కార్యకర్తలు ఆగమన్నా ఆగరు, సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసిన వైఎస్ జగన్
Hazarath Reddyఇవాళ మీరు(చంద్రబాబును ఉద్దేశించి) అధికారంలో ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి వస్తాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అప్పుడు ఆగమన్నా మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని హెచ్చరికలు జారీ చేశారు వైఎస్ జగన్.
Visakha MLC Election: వైసీపీ విజయం లాంఛనమేనా ? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, 30న పోలింగ్, సెప్టెంబర్ 3న కౌంటింగ్
Hazarath Reddyవిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని సమావేశంలో వెల్లడించారు.
Perni Nani on TDP Red Book: పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగంపై మండిపడిన పేర్ని నాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరుగుతోందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే, పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bangladesh Unrest: బంగ్లాదేశ్ అల్లర్లు, ప్రధాని మోదీ నివాసంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసర భేటీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు
YS Jagan: తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్
Hazarath Reddyఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్‌లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Excise Policy Case: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది. ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, చట్టవిరుద్ధమని చెప్పలేమని కోర్టు పేర్కొంది.
Telangana Runamafi: మీకు రుణమాఫీ కాలేదా, అయితే మీకోసమే బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్, రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు నిద్రపోనివ్వంటున్న గులాబీ నేతలు
Arun Charagondaతెలంగాణ రాష్ట్రం లో రైతులు గౌరవంగా బతకగలమని గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి....కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారు...వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు అన్నారు.
Prasanth Kishore: పదో తరగతి పాస్ అయితే బీహార్ సీఎం, సీఎం నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్
Arun Charagondaయువత రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇటీవలే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్, జన్ సురాజ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
Danam Nagender Comments Row: తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన దానం నాగేందర్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన, తన పనితీరు గురించి అందరికీ తెలుసని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు