Politics
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనీష్ సిసోడియా, కవితల జ్యుడిషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు
Hazarath Reddyఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, BRS నాయకురాలు కె. కవితల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వారి కస్టడీని పొడిగించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీకి వచ్చేసిన బుల్డోజర్ సంస్కృతి, తిరువూరులో వైసీపీ భవనాన్ని కూల్చేందుకు కార్యకర్తలతో కలిసి బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్
Hazarath Reddyసినిమాల్లో విలన్ సీన్లను తలపించేలా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం సాగింది. ఎ.కొండూరు మండలం కంభపాడులో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌సీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యేర్యాలీగా వెళ్లారు.
PM Modi On NEET Issue: నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక
Hazarath Reddyనీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి విదితమే. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు.
PM Modi on Rahul Gandhi: దేశమంతా చూసేలా సభలో కన్ను కొట్టిన ఆ పిల్లాడి తీరులో మార్పు రాలేదు, రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వీడియో ఇదిగో..
Hazarath Reddyమోదీ మాట్లాడుతూ.. సభలో కొందరు దొంగ ఏడుపులు ఏడ్చారు. తనని కొడుతున్నారని మాట్లాడారు. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సభలో ఆ పిల్లాడు కన్ను కొట్టిన తీరు అంతా చూశారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
PM Modi Slams Rahul Gandhi: వీడియో ఇదిగో, 543కి 99 మార్కులు తెచ్చుకుని చిన్న పిల్లోడు మురిసిపోతున్నాడు, రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ..
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీపై ఛలోక్తులు విసిరారు. రాహుల్‌ను చిన్నపిల్లాడితో పోలుస్తూ, వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు
Lok Sabha Adjourned Sine Die: లోక్‌సభ నిరవధిక వాయిదా, ఆ పిల్లాడు కన్ను కొట్టాడంటూ రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీపై ధ్వజం
Hazarath Reddyజులై 24న ప్రారంభమైన 18వ లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం
Rudraవిభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు
KTR vs Revanth Reddy: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే..సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలని సూటి ప్రశ్న
Hazarath Reddyపార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా… ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ చెప్పారు
Rahul Gandhi on Agniveer Scheme: ఆర్మీకి వ్యతిరేకంగా అగ్నివీర్ స్కీమ్,లోక్‌సభలో ఎన్డీఏపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ, కౌంటర్ విసిరిన రాజనాథ్ సింగ్
Hazarath Reddyకాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్మీకి వ్యతిరేకంగా అగ్నివీర్ స్కీమ్ ఉందన్నారు. దేశభక్తులు కూడా ఆ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు
Rahul Gandhi Slams BJP: వీడియో ఇదిగో, శివుని బొమ్మతో బీజేపీని ఏకి పారేసిన రాహుల్ గాంధీ, హింసని ప్రేరేపించే మిమ్మల్ని హిందువులని ఎలా అనగలమని సూటి ప్రశ్న
Hazarath Reddyకాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు.శివుని (Lord Shiva) ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కురుకుపోయి ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi’s Hindu Remarks: మోదీ హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని మోదీ ఏమన్నారంటే..
Hazarath Reddyలోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై నేడు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భయం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు అని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడుతాయని, ఇస్లాం, సిక్కు మతంలో భయంలేదన్నారు.
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది.
Pawan Kalyan on Pension Distribution: గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదని వెల్లడి
Hazarath Reddyపిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల (AP Pension) పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు.
Justice Narasimha Reddy Commission Row: విద్యుత్ కమిషన్ విచారణ రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చంటూ స్పష్టం
Hazarath Reddyబీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన రిట్ పిటిషన్‌ను (Former CM KCR’s writ petition) తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే
Pension Distribution in AP: వీడియోలు ఇవిగో, కాళ్లు కడిగి మరీ పెన్షన్లు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేస్తున్నారు.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు, కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఢిల్లీ సీఎంను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ డిమాండ్
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ శనివారం(జూన్29) రౌస్‌ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్
Rudraసినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని
Rudraకొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.
CM Revanth Reddy On Jagan: జగన్ చచ్చిన పాము, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఏమన్నారంటే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.