Politics

Andhra Pradesh Elections 2024: 175కు 175 సీట్లు గెలుపే లక్ష్యంగా మరో జైత్రయాత్రకు సిద్దమైన సీఎం జగన్, నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను విడుదల చేసిన వైసీపీ

Hazarath Reddy

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతోపాటు డమ్మీ, ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు భారీగానే నామినేషన్లు వేశారు. రేపు(శుక్రవారం) నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

Andhra Pradesh Elections 2024: పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ, వైసీపీలో చేరిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి దంపతులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పులివెందులలో సీఎం జగన్‌ సమక్షంలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి దంపతులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున శ్రీనాథ్‌ రెడ్డి భార్య అనీషా రెడ్డి పోటీ చేశారు

YouTuber Manish Kashyap Joins BJP: కాషాయపు కండువా కప్పుకున్న ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ కాషాయపు కండువా కప్పుకున్నారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీకి తన తల్లి పెద్ద అభిమాని అని చెప్పారు

Advertisement

Lok Sabha Elections 2024: కాంగ్రెస్, ఎస్పీ చేసేవన్నీ విభజన రాజకీయాలే, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్‌ ముద్ర ఉందని మండిపడిన ప్రధాని మోదీ

Hazarath Reddy

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తమ ఓటు బ్యాంకులను పదిలం చేసుకునేందుకు విభజన రాజకీయాలు చేస్తున్నాయని, అయితే బీజేపీ మాత్రం అందరినీ అభివృద్ధి చేసే రాజకీయాలను చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత కూటమి బుజ్జగింపు రాజకీయాలపై మండిపడ్డారు

AP Intelligence New Chief: ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ కొత్త బాస్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ, అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఇంటిలిజెన్స్ చీఫ్ (Intelligence Chief )గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజిత్‌ (Kumar Vishwajit), విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ (PHD Ramakrishna)ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) నియమించింది

Veera Siva Reddy Joins YSRCP: కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తానని వెల్లడి

Hazarath Reddy

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీనీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.

Andhra Pradesh Elections 2024: పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లారు

Advertisement

Theenmar Mallanna: నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

Rudra

నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ను బరిలో దింపుతున్నట్లు వెల్లడించింది.

Telangana Elections 2024: ప్రధాని మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలే, మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని మండిపడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని CM రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో బుధవారం(ఏప్రిల్‌24) జరిగిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు.

Srikakulam Memantha Siddham Sabha: ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారని టెక్కలి సభలో ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది

Nitin Gadkari Health Update: ఎండ వేడి కారణంగానే స్పృహ కోల్పోయాను, ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన గడ్కరీ

Hazarath Reddy

తన అధికారిక X హ్యాండిల్ ద్వారా హెల్త్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. “మహారాష్ట్రలోని పుసాద్‌లో ర్యాలీ సందర్భంగా వేడి కారణంగా నేను అసౌకర్యంగా భావించాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. తదుపరి సమావేశానికి హాజరు కావడానికి వరుద్‌కు బయలుదేరుతున్నాను. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Nitin Gadkari Faints Video: మాట్లాడుతూనే స్పృహ కోల్పోయిన నితిన్‌ గడ్కరీ వీడియో ఇదిగో, సకాలంలో చికిత్స అందదడంతో కోలుకున్న కేంద్ర మంత్రి

Hazarath Reddy

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగానే స్పృహతప్పి పడిపోయారు.అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందదడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది పాటి విరామం తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Harish Rao Challenge to CM Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

Hazarath Reddy

ఆగస్టు 15 లోగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Vizianagaram Memantha Siddham: తండ్రి సమానులు అని సీఎం జగన్ చెప్పగానే భావోద్వేగానికి గురైన బొత్సా సత్యనారాయణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

CM Jagan Memantha Siddham Yatra: రేపటితో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర, 21 రోజులు పాటు 22 జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్, 15 భారీ బహిరంగ సభల్లో ప్రసంగం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధ­వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ముగి­యనుంది

Advertisement

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ కే కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మే 7 వరకు పొడిగింపు

Hazarath Reddy

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ నేత కె. కవితలకు ఢిల్లీ కోర్టు మంగళవారం జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగించింది.

Telangana Elections 2024: మూడు ప్రధాన పార్టీలకు షాకిచ్చిన బర్రెలక్క, నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ, నామినేషన్ వేసిన కర్నె శిరీష

Hazarath Reddy

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష తాజాగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఆగస్ట్ 15 లోపల రూ. 2 లక్షల రుణమాఫీ, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్తున్నా..ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని అన్నారు.

Arvind Kejriwal: ఎట్ట‌కేల‌కు కేజ్రీవాల్‌ కు ఇన్సులిన్ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు

Rudra

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు తీహార్ జైలు అధికారులు ఎట్ట‌కేల‌కు లో డోసు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది.

Advertisement
Advertisement