New Delhi, August 24: కాంగ్రెస్ అధిష్ఠానం గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై (Congress President's Post)కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతోంది. అన్నీ కుదిరితే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు (Rajasthan CM Ashok Gehlot) అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం (Sonia Gandi's choice to 'lead' Congress) తీసుకున్నట్లు సమాచారం. మెడికల్ చెకప్ మరియు చికిత్స కోసం విదేశాలకు వెళ్లే ముందు బాధ్యతలు స్వీకరించాలని సోనియా గాంధీ అభ్యర్థించినట్లు సంబంధిత వర్గాలు సూచించాయి.అయితే గెహ్లాట్ శిబిరం ఈ పరిణామాన్ని ధృవీకరించలేదు
పార్టీ సమావేశంలో అశోక్ గెహ్లాట్ మాత్రం రాహుల్ గాంధే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వచ్చే సెప్టెంబర్ 21 నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనున్నది. సోనియా మంగళవారం రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ పగ్గాలు చేపట్టాలని గెహ్లాట్‌ను కోరినట్లు తెలుస్తున్నది. అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతలు నిర్వహించలేనని సోనియా గాంధీ గెహ్లాట్‌తో చెప్పినట్లు సమాచారం.
Here's IANS Tweet
#Rajasthan Chief Minister #AshokGehlot (@ashokgehlot51) has emerged as the top choice for the #Congress (@INCIndia) president's post. Sources have indicated that #SoniaGandhi has requested him to take over before she heads abroad for medical checkup and treatment. pic.twitter.com/8k9rZeRQMB
— IANS (@ians_india) August 24, 2022
సోనియా గాంధీని కలిసిన తర్వాత గెహ్లాట్ ఢిల్లీ విమానాశ్రయంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాతే పార్టీని పునర్నిర్మించగలమని తాను పదేపదే చెబుతున్నానన్నారు.ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకుంటే నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురవుతారన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నిరంతరం ఒత్తిడి తెస్తామన్నారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటే.. ఎవరూ బలవంతం చేయలేరని అన్నారు.
మరో వైపు గెహ్లాట్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు సచిన్ పైలట్‌ను సీఎంగా వచ్చే రాజస్థాన్ ఎన్నికల బరిలోకి దింపనున్నది. ఇటు విధేయుడికి పార్టీలో కీలక పదవిని కట్టబెట్టడంతో పాటు రాజస్థాన్ నేతల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గులాం నబీ ఆజాద్ మరియు ఆనంద్ శర్మ రాష్ట్ర కమిటీల నుండి రాజీనామా చేసిన తర్వాత G-23 గ్రూపింగ్ ఫైరింగ్ లైన్‌లో ఉండకూడదని కాంగ్రెస్ సెప్టెంబర్ నాటికి సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్ నేతల కోసం బలమైన వ్యక్తి భూపిందర్ సింగ్ హుడా ఫైట్ చేస్తున్నాడు.ఇక అగ్నిపథ్ పథకంపై మనీష్ తివారీ కాంగ్రెస్ వైఖరికి విరుద్ధమైన వైఖరిని తీసుకున్నారు. ఇది పార్టీకి అసౌకర్యాన్ని కలిగించింది.
ప్రతి మండలానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌లను నియమిస్తూ సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని కొంతకాలం క్రితం మరో ఆలోచన వచ్చింది.ఇక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పార్టీ అగ్ర పదవికి ప్రచారంలో ఉన్న మరో పేరు.