Newdelhi, March 7: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బీజేపీ ఎంపీ (BJP MP), ఆ పార్టీ కర్ణాటక చీఫ్ నళిన్ కుమార్ కటీల్ (Nalin Kumar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా దాడి చేశారు. ఒకానొక స్థాయిలో పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
Karnataka BJP Chief Naveen Kateel makes a disgusting personal remark on Rahul Gandhi; he calls him 'impotent'.
Shame on the BJP for making such a disgraceful remark: @ArshadRizwan pic.twitter.com/8dvAAtOWwt
— TIMES NOW (@TimesNow) March 6, 2023
కర్ణాటకలోని రామనగరలో ఆదివారం నిర్వహించిన జన సంకల్ప యాత్ర ఇంధుకు వేదికైంది. నళిన్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దని, అది తీసుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ప్రచారం చేశారని మండిపడ్డారు. అయితే, రాత్రిపూట రహస్యంగా వారిద్దరూ ఆ వ్యాక్సిన్ తీసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని అన్నారు. ఇదే విషయాన్ని తమ ఎమ్మెల్సీ మంజునాథ్ కూడా చెప్పారని అన్నారు.
నళిన్ కుమార్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీలో అందరికీ ఉన్నట్టుగా నళిన్ కుమార్‌కు కూడా తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించింది.