Credits: Twitter (Representational)

Newdelhi, March 7: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు (NEET-2023) నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) (NTA) పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ (Notification) ను తీసుకువచ్చింది.

పరీక్ష ఎప్పుడు?

మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్-2023 పరీక్షను నిర్వహించనున్నారు.

మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభించనున్న సీఎం జగన్, 35,41,151మంది అవ్వా తాతల కోసం వైఎస్సార్‌ కంటి వెలుగును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

ముఖ్యమైన వివరాలు:

  • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది
  • మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,700
  • జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు ఫీజు రూ.1,600
  • ఎస్సీ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఫీజు రూ.100
  • విదేశాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.9,500
  • హాల్ టికెట్ల డౌన్ లోడ్, ఎగ్జామ్ సెంటర్ల సమాచారం కోసం ఎన్టీయే వెబ్ సైట్ ను సందర్శించాలి
  • https://neet.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా నీట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌పై డీడీఆర్పీ కీలక సూచన, దెబ్బతిన్న చోట్ల యు ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌