Naveen Patnaik Record: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొత్త రికార్డు.. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తి.. జ్యోతిబసు రికార్డు బద్దలు

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటివరకూ ఎక్కువ కాలం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టి రెండోస్థానంలో నిలిచారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు.

Naveen Patnaik Record: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొత్త రికార్డు.. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తి.. జ్యోతిబసు రికార్డు బద్దలు
Naveen Patnaik (Credits: Twitter)

Newdelhi, July 23: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటివరకూ ఎక్కువ కాలం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టి రెండోస్థానంలో నిలిచారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్‌ 21 నుంచి 2000 నవంబర్‌ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు.

Road Accident: చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన

అయిదు పర్యాయాలు

ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్‌ పట్నాయక్‌ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో చామ్లింగ్‌ తర్వాత రెండో స్థానంలోకి చేరారు.

Viral Video: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన.. వీడియో వైరల్

(The above story first appeared on LatestLY on Jul 23, 2023 09:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).