Newdelhi, July 23: బంగ్లాదేశ్ (Bangladesh) లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్ పూర్ కు 70 మందితో వెళ్తున్న బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
17 Killed, 35 Injured In Bangladesh After Bus Falls Into A Pond: Report https://t.co/H6ysNggB0E pic.twitter.com/GIBX02xggX
— NDTV (@ndtv) July 23, 2023
ప్రమాద కారణమిదే
ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.