PM Unveils BJP Manifesto for LS Polls: రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో.. పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్, 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, రాబోయే ఐదేళ్లు ఉచిత రేషన్
లోక్ సభ ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రధాని నరేంద్ర మోదీ నేడు విడుదల చేశారు. ‘గ్యాన్’ అభివృద్ధి లక్ష్యంగా (GYAN - గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోను రూపొందించారు.
Newdelhi, Apr 14: లోక్ సభ ఎన్నికలకు (LS Polls) ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు విడుదల చేశారు. ‘గ్యాన్’ అభివృద్ధి లక్ష్యంగా (GYAN - గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "We will move forward with a resolve to realise the idea of One Nation, One Election. BJP also considers the Uniform Civil Code (UCC) equally necessary in the interest of the country." pic.twitter.com/ZxXUkeyqe5
— ANI (@ANI) April 14, 2024
Salman Khan: ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం.. ఫైరింగ్ జరిపిన ఆగంతకుడు
బీజేపీ ఎన్నికల హామీలు ఇవే..
- రానున్న కాలంలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్
- రాబోయే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్
- వచ్చే ఐదేళ్లలో మరో 3 కోట్ల గృహాల నిర్మాణం
- 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
- పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి
- ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంక్షేమ పథకాల విస్తరణ
- ధరల స్థిరీకరణపై ఫోకస్.. ప్రతి ఇంటికి తాగునీరు
(The above story first appeared on LatestLY on Apr 14, 2024 11:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

