Srinagar, May 22: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లోని శ్రీనగర్‌లో (Srinagar) జీ20 (G20) టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పోలీసులు (Police) పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
Tight security deployments made in #JammuAndKashmir in the wake of G20 working group meeting at Srinagar.
This is the first international meet of this stature in #Kashmir in decades. #G20Kashmir #G20inSrinagar@SaahilSuhail reports pic.twitter.com/GtoJjtv3yV
— Mirror Now (@MirrorNow) May 22, 2023
60 మంది ప్రతినిధులు..
ఈ సమావేశాల్లో జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. జమ్ములో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం చెప్పగా, సౌదీ అరేబియా ఇప్పటివరకూ సమావేశంలో పాల్గొనడంపై ఎటూ తేల్చలేదు. ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని టర్కీ నిర్ణయించింది.