Filing IT Returns: ఐటీ రిటర్న్స్ దాఖలుకు టైం దగ్గరపడింది, ఈ తప్పులు జరుగకుండా చూసుకోండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు
It Returns Filing (PIC@ Pixabay)

Mumbai, May 26: ప్రతి వేతన జీవి.. చిన్న వ్యాపారి.. ఒక కన్సల్టెంట్.. కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంపై ప్రతిఏటా ఐటీ రిటర్న్స్ (IT Returns) సమర్పించాలి. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఐటీ రిటర్న్స్ సమర్పించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు దాఖలు చేసేందుకు ఐటీ రిటర్న్స్ పత్రాలు అందుబాటులోకి తెచ్చామని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. కనుక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎటువంటి తప్పులు, పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. అడిటింగ్ అవసరం లేని వేతన జీవులు.. వచ్చే జూలై నెలాఖరు వరకు ఐటీ రిటర్న్స్ (IT Returns) దాఖలు చేయాలని ఆదాయం పన్ను విభాగం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ఫామ్-16 అందజేశాయి. వీటి ఆధారంగా ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం సులువుగా ఉంటది.

ముఖ్యంగా వేతన జీవులు చేసే పొరపాట్లలో ఒకటి తగిన ఐటీఆర్ ఫామ్ (Mistakes In Filing IT Returns) ఎంచుకోవడమే.. సరైన ఫామ్ ఎంచుకుని ఆదాయం వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఐటీ రిటర్న్స్ ఫామ్స్ (IT Returns) మొత్తం ఏడురకాలు. ఇంటిపై ఆదాయం, వడ్డీ ఆధారిత ఇన్ కం రూ.50 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్-1 ఫామ్ సబ్మిట్ చేయొచ్చు.

Clean Note Policy: క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి, రూ. 2000 నోట్లు ఉపసంహరణ ఈ విధానంలోనే ఎందుకు, RBI వెబ్‌సైట్ క్రాష్ కారణాలేంటి ? 

రూ.50 లక్షలకు పైగా ఆధాయం, ఒకే ఇంటిపై ఆదాయం లభిస్తున్న వారు ఐటీఆర్-2 దాఖలు చేయాలి. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫామ్స్‌పై సందేహాలు, అనుమానాలు ఉన్న ప్రొఫెషనల్స్ ఐటీఆర్-3 ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. స్టాక్స్ క్రయ విక్రయాల్లో లావాదేవీల ఆధారంగా సంబంధిత వ్యక్తులు ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 ఫామ్ ఆప్ట్ చేసుకోవాలి. ఇక రూ.50 లక్షలపై చిలుకు ఆదాయం గల వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (HUF) వారు ఐటీఆర్-4 ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మిగతా పత్రాలు సబ్మిట్ చేస్తాయి.

RBI Website Crashes: ఆర్‌బీఐ వెబ్‌సైట్ క్రాష్, రూ.2000 నోట్లు ఉపసంహరణ వార్తలతో ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి వెళ్లిన యూజర్లు 

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వేతన జీవులు, ఇతర వ్యక్తులు తమకు వచ్చే ఆదాయ వివరాలు తప్పక నమోదు చేయాలి. ఆదాయ వివరాలు కొందరు నమోదు చేయకుండా వదిలేస్తారు. ఇది ఆదాయం పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని ఇన్ కం టాక్స్ అధికారులు గుర్తిస్తే నోటీసులు జారీ చేస్తారు. దాదాపు చాలా మంది తమ వేతన ఆదాయ వివరాలు మాత్రమే నమోదు చేస్తారు. బ్యాంకు పొదుపు ఖాతాతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలతో వచ్చే ఇన్ కం, పీపీఎఫ్ మీద వచ్చే వడ్డీ ఆదాయం వివరాలు పట్టించుకోరు. కానీ ఐటీ రిటర్న్స్ మినహాయింపు పరిధిలోకి వచ్చే అన్ని రకాల ఆదాయ వనరుల వివరాలను ఐటీ రిటర్న్స్‌లో సమర్పించాలని ఆదాయం పన్నుచట్టం చెబుతున్నది. తమ పిల్లల పేరిట పెట్టిన పెట్టుబడులపై వచ్చే ఆదాయం వారి పోషకులుగా తల్లిదండ్రుల ఆదాయంలోనే చూపాల్సి ఉంటది.

Rs 2000 Note Journey and History: ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా.. 

ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ప్రధానంగా ఐటీ రిటర్న్స్ మినహాయింపులు కోరవచ్చు. ఈ సెక్షన్ కింద వివిధ పథకాల్లో మినహాయింపులు రూ.1.50 లక్షల వరకు క్లయిమ్ చేయవచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం పేమెంట్స్, ఇంటి రుణం అసలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎన్ఎస్ పేమెంట్స్ కూడా ఐటీ చట్టంలోని 80సీ సెక్షన్ కిందకు వస్తాయి. పన్ను ఆదా కోసం మదుపు చేసిన అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలు రిటర్న్స్‌లో సరిగ్గా నమోదు చేయాలి.

ఒక్కోసారి ఆదాయం పన్ను విభాగం వద్ద ఉన్న డిటైల్స్‌కూ, మీరు సమర్పించే ఫామ్-16 కూ తేడా ఉండొచ్చు. మీ వద్ద వసూలు చేసిన ఆదాయం పన్ను.. ఆదాయం పన్ను విభాగంలో డిపాజిట్ చేయకపోవడం వల్లే ఈ తేడా కనిపిస్తుంది. కనుక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ముందు మీ ఫామ్-16, ఫామ్-16ఏ, 26ఎఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఏఐఎస్)లు పూర్తిగా చెక్ చేసుకోవాలి. తేడాలు ఉంటే వెంటనే యాజమాన్యం తో సంప్రదించి చెక్ చేసుకోవాలి. అలా కాకుండా ఐటీ రిటర్న్స్‌లో పొరపాట్లు ఉంటే ఆదాయం పన్నువిభాగం అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది.