Hiccups: ఎక్కిళ్లు ఏం చేసినా అగడం లేదా, అదే పనిగా వస్తున్నాయా.. ఇలా చేసి చూడండి, చిటికెలో తగ్గిపోతాయి
hiccup (Photo-pixabay)

ఎక్కిళ్లు ( Hiccups ) దాదాపుగా అంద‌రికీ కామ‌న్‌గా వ‌చ్చే స‌మ‌స్యే. మనలో అందరికీ ఎక్కిళ్ళు వచ్చిన అనుభవం ఉండే ఉంటుంది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు పొట్ట లోపలికి పోవడం గొంతులోనుంచి మన ప్రమేయం లేకుండానే ఒక రకమైన శబ్దం రావడం జరిగిపోతుంది. మనకొచ్చే, ఆవలింత, తుమ్ము, ఎక్కిళ్ళు లాంటివి మనకు సంబంధం లేకుండా మన ప్రయత్నం లేకుండా ఇంకా చెప్పాలంటే మన కంట్రోల్ లేకుండా వస్తుంటాయి కదూ. అసలు ఎక్కిళ్ళు అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తుంటాయి?

సాధార‌ణంగా ఎక్కిళ్లు వ‌స్తే ఒక‌టి రెండు నిమిషాల్లో త‌గ్గిపోతాయి. కానీ కొంత‌మందికి ఒక‌ప‌ట్టాన త‌గ్గ‌వు. త‌ర‌చూ ఈ స‌మ‌స్య వ‌స్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు త‌గ్గినా ఈ స‌మ‌స్య అలాగే ఉంటుది. మనకు వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి 'హిక్' అనే ధ్వనికి కారణమవుతుంది. దీన్నే వెక్కిళ్లు అని పిలుస్తారు. దాదాపు 100కుపైగా భిన్న శారీరక పరమైన కారణాలు వెక్కిళ్లకు దారితీస్తాయి. అయితే ఇవన్నీ పెద్దగా అపాయాన్ని కలిగించవు.

గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే లాభాలు, మీ ఆరోగ్యానికి దీన్ని మించి మరే ఔషధం లేదని చెబుతున్న వైద్యులు, ఉపయోగాలు ఏంటో ఓ సారి చూడండి

ఇక మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తాయి. కొన్ని మత్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా వెక్కిళ్లకు దారితీస్తాయి. నవ్వడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వేగంగా తినడం వంటి విధానాల వల్ల, ఒక్కోసారి అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా వెక్కిళ్లు వచ్చే అవకాశముంది.

వీర్య కణాలు పెరగాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు..స్పెర్మ్ నాణ్యతకు తీసుకోవాల్సిన ఆహార పదార్డాల లిస్ట్ ఏమిటో ఓ సారి తెలుసుకోండి

ఎక్కిళ్ళు సామాన్యంగా మనం ఎక్కువ ఘాటుగా (మాసాలాతో చేసిన) ఉండే ఆహార పదార్థం తిన్న తరువాత గానీ లేక ఎక్కువ మెతాదులో భోజనం చేసిన తరువాత గానీ వస్తుంటాయి. అవి మొదలైన తరువాత ఐదు ఆరు నిమిషాల దాకా వస్తుంటాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని భయపెట్టే అబద్ధం చెబితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అని అంటుంటారు. కొందరు చక్కెర (పంచదార) నాలుక క్రింద ఉంచుకొంటే తగ్గిపోతాయి అంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కొండ ఎత్తు నుండి దుమికితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అంటారు. ఏది ఏమైన వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎక్కిళ్ళు ఆగకుండా గంటకన్నా ఎక్కువ సేపు వస్తుంటే వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది.

ఎక్కిళ్లు ఆగాలంటే

గోరు వెచ్చని నీళ్లని కొద్ది కొద్దిగా సిప్ చేయాలి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు కూల్ డ్రింక్స్ అస్సలు ముట్టుకోవద్దు.

చిన్న అల్లంముక్క నమిలి రసాన్ని మింగాలి.

కప్పు నీటిలో చెంచాడు యాలకుల పొడి వేసి మరిగించి, చల్లారాక తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.

పెరుగులో కాసింత ఉప్పు కలుపుకుని, మెల్లమెల్లగా తింటున్నా ఆగుతాయి.

నీళ్ల గ్లాస్ పైన టవల్ కానీ, హ్యాండ్ కర్చీఫ్ కానీ వాసెన లాగా కట్టి నీళ్లని పీల్చుకుంటున్నట్టు తాగాలి.

ఒక్క చుక్క వెనిగర్ ని నాలుక మీద వేసుకొని చప్పరించాలి.

చాతీమీద చిన్నగా మసాజ్ చేయాలి. లేదంటే కుర్చీ మీద కూర్చొని మోకాళ్ల మీదకి వంగి పొట్ట, చాతీ మీద కొద్దిగా ప్రెజర్ తేవాలి.

అయితే ఈ చిట్కాలన్నీ పాటించినా ఒక రోజుకంటే ఎక్కువ సేపు ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం లేట్ చేయకుండా డాక్టర్‌‌‌‌‌‌‌‌ని కలవాలి.

నోట్ : ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా కథనం ఇవ్వబడింది. వీటిని మీ  సొంత వైద్యుడు, ఆరోగ్యసంరక్షణ నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. ఈ కంటెంట్ పై వినియోగదారుడు చేసే ప్రయత్నానికి లేటెస్ట్ లీ బాధ్యత వహిచదు. మీరు మీ ఆరోగ్యం గురించి సందేహాలుంటే ఎల్లప్పుడూ డాక్టర్ ని సంప్రదించండి