Credits: Twitter/ANI

Jaipur, Jan 2: రాజస్థాన్‌లో (Rajasthan) ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (Train Accident) పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాంద్రా టెర్మినస్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్‌ ప్రెస్ (Suryanagari Express) జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావస్-బొమద్ర మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త వెబ్ సైట్ ‘మహేశ్ బాబు ఫౌండేషన్ డాట్ ఆర్గ్’

సమాచారం అందుకున్న వెంటనే నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలానికి బయలుదేరారు. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేశారు.

జనవరి 2వ తేదీ నుంచి కొత్త ఏడాది మొత్తం నుంచి ఈ వాస్తు జాగ్రత్తలు పాటిస్తే, లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది..

రైలు మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోపే రైలులో కుదుపు లాంటి శబ్దం వచ్చిందని, ఆ తర్వాత రెండుమూడు నిమిషాలకే రైలు ఆగిపోయిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. కిందికి దిగి చూస్తే చివరి ఎనిమిది బోగీలు పట్టాలు తప్పి కనిపించాయని వివరించాడు. ఆ తర్వాత 15-20 నిమిషాలకే అక్కడికి అంబులెన్సులు వచ్చినట్టు తెలిపాడు.