Screen garb from viral video

Nirmal, FEB 26: అదో పెళ్లి వేడుక. అంతా ఆనందంగా ఉన్నారు. వధువు, వరుడు, వారి కుటుంబసభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెళ్లి వేడుక కావడంతో పాటలకు డ్యాన్స్ (Dancing At Wedding) చేస్తున్నారు. ఓ యువకుడు కూడా రవితేజ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్నాడు. పాటకు అనుగుణంగా హావభావాలతో డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న యువకుడు సడెన్ గా కుప్పకూలిపోయాడు (Collapses). ఆ వెంటనే చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన నిర్మల్ జిల్లాలో (Nirmal District) చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు పెళ్లి శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి పార్డిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

పెళ్లి కొడుకు మిత్రుడు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19).. ఈ వేడుకకు హాజరయ్యాడు. అతడు రవితేజ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్నాడు. అప్పటిదాకా డ్యాన్స్ చేసిన అతడు.. ఉన్నట్టుండి ఆగిపోయాడు. అలానే కిందికి పడిపోయాడు. దాంతో అక్కడున్న వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ యువకుడు చనిపోయాడని తెలిసి అంతా షాక్ తిన్నారు. కాగా, యువకుడి మృతికి గుండెపోటే (Heart Attack) కారణం అని తెలుస్తోంది.  అప్పటివరకు ఎంతో సందడిగా ఉన్న పెళ్లింట.. యువకుడి మృతితో తీవ్ర విషాదం అలుముకుంది. అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన యువకుడు సడెన్ గా కుప్పకూలి చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. యువకుడి కుటుంబసభ్యులు, మిత్రులు విషాదంలో మునిగిపోయారు. యువకుడు సినిమా పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Gujarat Shocker: తాళి కట్టే సమయానికి గుండెపోటుతో పెళ్లికూతురు మృతి, వెంటనే వధువు చెల్లితో వరుడికి ఇచ్చి పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు 

కాగా, నాలుగు రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో ఘటనలో ఓ యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కుప్పకూలి మరణించాడు. అప్పటివరకు బాగున్న మనుషులు, ఎంతో ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్న వారు సడెన్ గా చనిపోతుండటం ఆందోళనకు గురి చేసే అంశం.