Viral

Nana Patekar: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌

Hazarath Reddy

ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు.

World Cup 2023: క్రిస్‌గేల్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 27 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకుని వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. వాంఖడేలో టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తోంది.

MSME Fraud Case: చిక్కుల్లో హీరోయిన్ నమిత భర్త, నోటీసులు జారీచేసిన తమిళనాడు పోలీసులు

Hazarath Reddy

సినినటీ నమిత భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. అతను తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల కౌన్సిలింగ్ డిపార్ట్‌మెంట్ లో చైర్మన్ పదవి ఇప్పిస్తానంటు గోపాల్ స్వామి అనే వ్యక్తి దగ్గర రూ. 50 లక్షల దాకా నగదు తీసుకున్నట్లు సమాచారం

Tech Layoffs: భారీగా కొనసాగుతున్న లేఆఫ్స్, 2.5 లక్షల మంది ఉద్యోగులను తీసేసిన టాప్ కంపెనీలు, భవిష్యత్తులో కొనసాగనున్న మరిన్ని తొలగింపులు

Hazarath Reddy

టెక్‌ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్‌) భారీగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ, స్టార్టప్ సెక్టార్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 244,342 కంటే ఎక్కువ మంది టెక్ కార్మికులు తొలగించబడ్డారు,

Advertisement

Modi Ji Ko Jai Shree Ram: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని శ్రీరామునితో పోలుస్తూ నినాదాలు చేసిన చిన్నారి, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం గుమిగూడారు. కాగా, ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అమాయకపు చిన్నారి 'మోదీ జీకో జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేసింది. తన తల్లి భుజంపై కూర్చున్న చిన్నారి ప్రధాని మోదీని చూసేందుకు తహతహలాడుతున్నట్లు కనిపించింది.

India vs New Zealand Semi Final Prediction: భారత్ ఛేజింగ్ తీసుకుంటే న్యూజిలాండ్ మీద విజయం సాధిస్తుంది, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారతదేశం vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు ముందు, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం చెప్పాడు. ఈ పోటీలో భారత్ తప్పక గెలుస్తుందని తెలిపాడు.

HC on Husband Wife Relation: విద్యార్థినుల ఎదుట భార్యను అసభ్య పదజాలంతో దూషించడం మానసిక క్రూరత్వం, భార్యా భర్తల విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఉపాధ్యాయురాలైన తన భార్యను విద్యార్థినుల ముందు భర్త అసభ్య పదజాలంతో దుర్భాషలాడడం మానసిక క్రూరత్వంతో సమానమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఇలాంటి దుర్వినియోగం సమాజంలో ఆమె ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా హిందూ వివాహ చట్టం ప్రకారం మానసిక క్రూరత్వానికి పాల్పడుతుందని కోర్టు పేర్కొంది

World Cup 2023: వర్షం పడితే సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉందా? ఐసీసీ కీలక ప్రకటన ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌తో పాటు ఫైనల్‌కు కూడా రిజర్వ్ డేస్ ఉన్నాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ధృవీకరించింది. నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుండగా, రెండో సెమీ ఫైనల్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.

Advertisement

Caught On Cam: ఘోర విషాదం వీడియో ఇదిగో, తాత కారు కింద పడి నలిగిపోయిన మనవడు, అనుకోకుండా జరిగిన ప్రమాదంతో శోక సంద్రంలో కుటుంబం

Hazarath Reddy

కేరళ(Kerala)లోని కాసరగోడ్‌ జిల్లాలో అనుకోకుండా జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. కారు పార్క్‌ చేస్తోన్న సమయంలో తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు(Child) నలిగిపోయాడు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Covid in China: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న ఎక్స్‌‌బీబీ కరోనా వేరియంట్, కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు నమోదు, 24 మంది మృతి

Hazarath Reddy

చైనాలో మళ్లీ ఎక్స్‌‌బీబీ కరోనా వైరస్‌ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. వాటివల్ల అక్టోబరులో దేశంలో కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు సంభవించి 24 మంది మరణించారని చైనా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం తెలిపింది.కాగా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ల పునరాగమనంపై శీతాకాలం వచ్చిన తర్వాత చైనా అప్రమత్తంగా ఉంది. వృద్ధులు, బలహీన జనాభాకు టీకాలు వేయమని కోరింది.

World Cup 2023: 7 సార్లు సెమీస్‌కు చేరితే 3 సార్లు గెలిచి ఫైనల్‌కు, నాలుగు సార్లు ఇంటికి, ప్రపంచకప్‌ చరిత్రలో సెమీస్‌‌లో టీమిండియా ప్రదర్శన ట్రాక్ రికార్డు ఇదిగో..

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ పోటీలు ముగిసి అంతిమ సమరానికి నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఈ నెల 15, 16న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే, తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను ఈడ గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేనంటూ తుమ్మల నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన. ఏపీ నుండి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోను. ఈ టీడీపీ పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నానని తెలిపారు.

Advertisement

Tamil Nadu Rains: భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన తమిళనాడు సర్కారు, నేడు కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

Hazarath Reddy

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కడలూరు, మైలాడుతురై, విల్లుపురం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు. భారీ వర్షాలకు సంబంధించిన హెచ్చరికల కారణంగా నవంబర్ 14న యూనివర్శిటీలు మరియు పాఠశాలలు మూసివేయబడతాయని కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రకటించింది

Bengaluru Shocker: బెంగుళూరులో లెక్చరర్‌ దారుణం, ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిపై అత్యాచారం, వీడియో తీసి మళ్లీ మళ్లీ రావాలంటూ బ్లాక్ మెయిల్

Hazarath Reddy

బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న మేడమ్ కుమార్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి విద్యార్థినిని ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Children’s Day Wishes in Telugu: బాలల దినోత్సవం శుభాకాంక్షలు, చాచాజీ పుట్టిన రోజు సందర్భంగా అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ చెప్పేయండి ఇలా..

Hazarath Reddy

ప్రతి సంవత్సరం నవంబర్ 14న మనం పిల్లల దినోత్సవం జరుపుకుంటున్నాం. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా... ఇది నిర్వహించుకుంటున్నాం. ఈసారి ఆయన 134వ జయంతి జరుగుతోంది. నెహ్రూకి రోజాపూలు, పిల్లలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన రోజా పువ్వును తన కోటుకు పెట్టుకుంటారు.

Accident in UP: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి

Rudra

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌ జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది.

Advertisement

UP Horror: వ్యక్తి వెనుక పటాకులు కాల్చిన వైనం.. కుప్పకూలి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో ఘటన (వీడియోతో)

Rudra

వ్యక్తి వెనుక పటాకులు కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Blue Pea Dosa: వెరైటీ ఫుడ్ కాంబినేష‌న్.. ఇంట‌ర్‌ నెట్‌ లో వైర‌ల‌వుతున్న‌ బ్లూ దోశ (వీడియో)

Rudra

ఫుడ్ ఎక్స్‌ ప‌రిమెంట్స్‌ తో వెరైటీ కాంబినేషన్‌ల‌ను వైర‌ల్ చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌ గా బ్లూ పీ దోశ (Blue Pea Dosa) ఇంట‌ర్‌ నెట్‌ లో తెగ వైర‌ల‌వుతోంది. దోశ పిండిలో శంఖుపుష్పం పొడిని క‌ల‌ప‌డం ద్వారా త‌యారైన ఈ బ్లూ దోశ ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Sadar Utsav Mela: ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‌ లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 3 వరకు ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇదిగో!

Rudra

సదర్‌‌‌‌ ఉత్సవ మేళాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు.

Viral News: భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఐదేండ్ల జైలు.. భయపడకండి మనదగ్గర కాదులే.. మరెక్కడ??

Rudra

భర్త తన భార్య పుట్టిన రోజును మర్చిపోవడం, ఆమె ఆయనపై చిర్రుబుర్రులాడటం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే సమోవా దేశంలో మాత్రం ఇలాంటి భర్తలకు జైలు శిక్ష తప్పదు.

Advertisement
Advertisement