వైరల్

Madhya Pradesh: వీడియో ఇదిగో, కారు ఆపిన తర్వాత హ్యాండ్ బ్రేక్ వెయ్యకపోవడంతో జలపాతంలోకి వెళ్లిపోయిన కారు, చిన్నారితో పాటు ఇద్దరిని రక్షించిన స్థానికులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి వచ్చిన ఒక కుటుంబం కారుని జలపాతం దగ్గర్లో పార్క్ చేసింది. ఐతే హ్యాండ్ బ్రేక్ వెయ్యని కారణంగా ఆ కార్ ఒక్కసారిగా కదిలి జలపాతంలో పడిపోయింది. ఆ కారులో ఉన్న పాపని చుట్టుపక్కల వాళ్ళు కాపాడారు. పాపతో పాటు ముగ్గురు వ్యక్తులను వారు రక్షించారు. వీడియో ఇదిగో..

Viral Video: వైరల్ వీడియో ఇదిగో, ఛాతి వ్యాయామం చేస్తుండగా గుండెల మీద పడిన 20 కిలోల డంబెల్స్,ఘటనకు కారణమైన వ్యక్తికి 19 నెలలు జైలు శిక్ష

Hazarath Reddy

వైరల్ వీడియోలో షేన్ విలియం ర్యాన్ అనే వ్యక్తి జిమ్ లో బెంచ్ మీద పడుకుని ఛాతీ వ్యాయామం చేస్తున్నప్పుడుఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి అతనిపై పడ్డాడు. వీడియోలో కావాలనే పడినట్లుగా చూపిస్తోంది. కోర్టులో ఉద్దేశపూర్వకంగానే చేశాడని అంతిమ నిర్ణయానికి రావడంతో అతనికి జైలు శిక్ష విధించారు.

Video: వీడియో ఇదిగో, బండి లేదు నా గుండు లేదు పత్తా లేకుండా పోయారు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సైటైర్లు

Hazarath Reddy

అసెంబ్లీలొ చివరి రోజు సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంటా సీఎం బండి సంజయ్ మీద పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే బండి పోతే బండి .. గుండు పోతే గుండు అన్నోల్లు ఇప్పుడు బండి లేదు గుండు లేదు పత్తా లేకుండా పోయారు - సీఎం కేసీఆర్

Andhra Pradesh: వేలిముద్రతో అమ్మఒడి డబ్బు కాజేసిన వాలంటీర్‌, డబ్బులు అడిగితె ఇంకా పడలేదు వస్తే ఇస్తా అంటూ బుకాయిస్తున్నాడని మహిళ ఆవేదన

Hazarath Reddy

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేనిగుంట గ్రామానికి మీరావళి అన్న కుమారుడు ఖాసీం పీర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా లబ్దిదారు హుస్సేనమ్మ వేలిముద్ర తీసుకున్న వాలంటీర్.. అమ్మఒడి డబ్బులు తన అకౌంట్ లోకి మళ్లించాడు.

Advertisement

Road Accident Video: ఘోర విషాదం వీడియో ఇదిగో, రూ. 500 చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయిన యువకుడు

Hazarath Reddy

500 రూపాయల చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ - మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ చారి అనే యువకుడు రోడ్డుపక్కన భోజనం చేసి, రూ.500నోటు ఇవ్వడంతో హోటల్ నిర్వాహకుడు చిల్లర లేదని చెప్పాడు. చిల్లర తీసుకొని వెనుదిరగగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు

Chandrababu on Work From Home to Police: వీడియో ఇదిగో, పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా, చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు తన పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా చేస్తున్నానని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వీడియో ఇదిగో..

Chandrababu on liquor Policy: సాయంత్రం అయితే నా తమ్ముళ్లకు ఓ పెగ్గు పడాల్సిందే, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇక్కడ నా తమ్ముళ్లు మందు బాబులు ఉంటారు.. రోజంతా కష్టపడతారు, ఒక పెగ్గు వేసుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, నాసిరకం సరుకు అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు ఏపీ మద్యం పాలసీపై మండిపడ్డారు. వీడియో ఇదిగో..

CM KCR on Jagan: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌ను చాలా ఇబ్బందులు పెట్టింది, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేదింపులు చేసి ఇబ్బందులు పెడితే ఆయన సొంత పార్టీ స్థాపించి కడప పులివెందుల ఉప ఎన్నికల్లో నాలుగైదు లక్షల మెజారిటీతో గెలుపొందాడు- సీఎం కేసీఆర్

Advertisement

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా డేనియల్ వెట్టోరీ, బ్రియాన్ లారా స్థానంలో నియామకం

Hazarath Reddy

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డేనియల్ వెట్టోరీ ఎంపికయ్యాడు. వెట్టోరి గతంలో 2014 నుండి 2018 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.

Sarfaraz Khan Gets Married: జమ్మూ కాశ్మీర్ అల్లుడైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్, పెళ్లి ఫోటో ఇదిగో..

Hazarath Reddy

ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ క‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అత‌ని వివాహ‌మైంది. స‌ర్ఫ‌రాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Video: పుల్లుగా తాగి మహిళ మీద పడిన ముందుబాబు, పట్టుకుని చితక్కొట్టిన మహిళలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో ఓ వ్యక్తి మద్యం తాగి మహిళలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆ వ్యక్తిని చంప చెల్లుమనిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

China Floods: చైనా వరదలు ఎలా ఉన్నాయో తెలిపే వీడియో, భారీ వరదలకు రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడడంతో అందులోకి దూసుకెళ్లిన కారు..

Hazarath Reddy

చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. రోడ్లకు రోడ్లు కొట్టుకుపోయాయి. తాజాగా ఈ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కారు రోడ్డు మీద వెళుతుండగా రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. డ్రైవర్ వేగంగా వెళుతూ ఈ గుంతను పసిగట్టలేకపోయాడు. బ్రేక్ వేసినప్పటికీ ఆ కారు డ్యామేజ్ అయిన రోడ్డు దగ్గర భూమిలోకి వెళ్లిపోయింది.

Advertisement

Caught-On-Cam: వీడియో ఇదిగో, టోల్ బూత్ సిబ్బందిని అతివేగంగా ఢీకొట్టిన కారు, చక్రాల కింద పడి తీవ్ర గాయాల పాలైన టోల్ బూత్ స్టాఫర్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో వేగంగా వెళ్తున్న కారు టోల్‌గేట్‌ను ఢీకొట్టి టోల్‌ బూత్‌ సిబ్బంది పైకి వెళ్లిన ఘటన కలకలం రేపింది. షాకింగ్ చర్య ప్రాంగణంలోని భద్రతా కెమెరాలలో బంధించబడింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది,

Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం, రెండో అంతస్తులోని ఎండోస్కోపీ రూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Hazarath Reddy

ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్‌ లోని రెండో అంతస్తులో గల ఎండోస్కోపీ రూమ్‌ (Endoscopy Room)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని వారందరినీ బయటకు పంపించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 6 ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.

Annavaram Temple New Rule: అన్నవరం వెళ్లే భక్తులకు గమనిక, గుడి దగ్గర రూం ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు నో ఛాన్స్

Hazarath Reddy

అన్నవరం దేవస్థానంలో కొత్త నిబంధన.. అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేదు. అన్నవరంలో వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు.

Viral Video: వీడియో ఇదిగో, ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తయిన విద్యుత్ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన యువతి, ప్రియుడు ఏం చేశాడంటే..

Hazarath Reddy

Advertisement

Assam shocker: అసోంలో అక్కాచెళ్లెల్లపై దారుణ అత్యాచారం, తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతులు

Hazarath Reddy

అసోంలోని కమ్రూప్‌ జిల్లాలో చెట్టుకు వేలాడుతున్న ఇద్దరు యువతుల మృతదేహాలు ఆదివారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని తులసిబారి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతులను మమతా బేగం (19), సైమన్ నెస్సా (17)గా గుర్తించారు.

Rahul Gandhi Back as Lok Sabha MP: రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరించిన లోక్‌సభ సెక్రటేరియట్, పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

మోదీ' ఇంటిపేరు వ్యాఖ్య కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం (ఆగస్టు 4) స్టే విధించిన తర్వాత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. ఇప్పుడు అతను పార్లమెంటు సమావేశాలకు హాజరుకావచ్చు.

Video: ప్రాణాలంటే లెక్కలేనంత నిర్లక్ష్యం, అడదిడ్డంగా డ్రైవ్, వారిని తప్పించబోయి బోల్తాపడిన లారీ, కొంచెం అటు ఇటూ అయిన ఇద్దరు ప్రాణాలు గాలిలోకే..

Hazarath Reddy

అదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది వద్ద నిర్లక్ష్యంగా బైక్ నడుపుతున్న ఇద్దరి ప్రాణాలు కాపాడిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వారిద్దరి నుంచి తప్పుకుని పక్కకు వెళ్లే సమయంలో లారీ ఒక్కసారిగా అదుపుతప్పడంతో బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో వీడియోలొ మీరే చూడండి. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..

Gaddar Final Journey: మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం.. బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇవిగో!

Rudra

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు.

Advertisement
Advertisement