వైరల్
Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు.. వచ్చే రెండుమూడు రోజులూ ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Rudraతెలంగాణకు వాతావరణశాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Oommen Chandy Passes Away: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత.. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చాందీ
Rudraకేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (79) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాందీ తుదిశ్వాస విడిచారు.
UP Horror: ఆగ్రాలో ఘోరం.. తాజ్ మహల్ చూడటానికి వచ్చిన యాత్రికుడిపై భక్తుల దాడి.. కర్రలు, రాడ్లతో చితకబాదిన వైనం.. క్షమించమని అడిగినా పట్టించుకోని దైన్యం.. అసలు యాత్రికుడి తప్పేంటి? ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న వైరల్ వీడియో..
Rudraయూపీలోని ఆగ్రాలో ఘోరం జరిగింది. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన ఓ పర్యాటకుడిని స్థానికంగా ఉండే కొందరు యువకులు, భక్తులు కర్రలు, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన బసాయి చౌకీ తానా తాజ్ గంజ్ ఏరియాలో జరిగింది.
Adhika Shravana Masam: రేపటి నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభం, ఈ తప్పులు చేస్తే జీవితంలో పెళ్లి కాదు, ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోండి..?
kanhaఈ అధిక శ్రావణ మాసం జూలై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణ మాసం ఉంది. ఈ అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు.
Uttar Pradesh Shocker: కుటుంబ సభ్యులు మొబైల్ తీసుకున్నారని ఇద్దరు బాలికలు ఉరివేసుకుని ఆత్మహత్య, ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో 16, 14 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు, వారి కుటుంబాలు తమ మొబైల్ ఫోన్‌లను ఎత్తుకెళ్లారని మనస్తాపంతో వారు ప్రాణాలు తీసుకున్నారు.
Gujarat: గుజరాత్‌లో స్కూల్ పిల్లలు వ్యానుకు ఎలా వేలాడుతూ వెళుతున్నారో చూడండి, పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లు తీసుకువెళుతున్న వ్యాన్ డ్రైవర్
Hazarath Reddyగుజరాత్‌లోని దాహోర్కి చెందిన ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ స్కూల్ విద్యార్థులను పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లు తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది పిల్లలు కారు వెనుక వేలాడుతూ ఉండగా, చాలా మంది పైకప్పుపై కూర్చున్నారు. మరి కొందరిని మంది పిల్లలను వాహనం బానెట్ పై కూర్చోబెట్టాడు డ్రైవర్. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Naved-Ul-Hasan on Virender Sehwag: సెహ్వాగ్‌కు బ్యాటింగ్ రాదు,మా దేశంలో అయితే గల్లీలోనే ఉండేవాడని పాక్ పేసర్ సంచలన వ్యాఖ్యలు, మూసుకోమంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌
Hazarath Reddyటీమిండియా మాజీ ఓపెనర్‌, డేరింగ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ పై (Naved-Ul-Hasan on Virender Sehwag) పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్ల తరగతుల గదులలోని స్క్రీన్‌లపై చంద్రయాన్ 3 ప్రత్యక్ష ప్రసారం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్‌గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్‌లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనినే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారంటూ ఓ నెటిజన్ ట్వీట్ షేర్ చేశారు.
Video: ఎవరి కర్మకు వారే బాధ్యులు, బైక్ మీద వెళ్తూ గేదెను తన్నినందుకు ఇద్దరికి ఎలాంటి అనుభవం ఎదురైందో వీడియోలో చూడండి
Hazarath Reddyవీడియోలో ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద బైక్ పై వెళుతూ పక్కన ఉన్న గేదెను తన్నుతారు. అయితే వారు బ్యాలన్స్ తప్పి కొంద పడిపోతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే వారికి ఎలాంటి గాయాలు అయ్యాయనే దానిపై సమాచారం లేదు.
Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయంలో ఇకపై మొబైల్ ఫోన్లు నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ
Hazarath Reddyయూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన ఘటన వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ.ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
Chandrayaan-3 Latest Update: విజయవంతంగా చంద్రుని వద్దకు పరిగెడుతున్న చంద్రయాన్ 3, రెండవ కక్ష్య-రేపన విన్యాసం సక్సెస్ అని తెలిపిన ఇస్రో
Hazarath Reddyచంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది
Sonia Gandhi Dance Video: సోనియాగాంధీ డ్యాన్స్ వీడియో ఇదిగో, మహిళా రైతులతో కలిసి చిందేసిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు
Hazarath Reddyకాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తన నివాసానికి వచ్చిన రైతులతో కలిసి చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ పంచుకోగా.. వైరల్‌గా మారింది.
Video: అభిమానమా లేక పిచ్చా..క్రేన్ మీద వచ్చి శాలువా కప్పిన పవన్ కల్యాణ్‌ అభిమాని, భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyతిరుపతిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.పవన్ కల్యాణ్‌ అభిమాని ఒకరు ప్రాణాలను లెక్కచేయకుండా క్రేన్ మీద వచ్చి శాలువా కప్పాడు. అయితే అంత ప్రమాదకర స్టంట్ ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి, వీడియో ఇదిగో..
Video: రాత్రిపూట స్మార్ట్‌గా వచ్చి బైక్ నుంచి పెట్రోల్ ఎత్తుకెళ్లిన దొంగ, సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్ - పిట్లం మండల కేంద్రంలోని తులసీరాం కాలనీలో ఈనెల 15న రాత్రివేళ పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగలించినట్లు కేసు నమోదైంది. చాటుగా వచ్చిన దొంగ ఇంటిముందు నిలిపి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ లాగేశాడు.
Video: మహిళా టోల్ ఉద్యోగినిపై దాడి చేసిన మరో మహిళ, టోల్ డిమాండ్ చేయడంతో నానా బూతులు తిడుతూ దాడి
Hazarath Reddyగ్రేటర్ నోయిడాలో కారులో వచ్చిన ఓ మహిళ.. మహిళా టోల్ ఉద్యోగినిపై దాడి చేసింది. టోల్ డిమాండ్ చేయడంతో టోల్ బూత్‌లోకి ప్రవేశించి నానా దుర్భాషలాడింది
Cat Saves Toddler: మెట్లపై నుంచి పడబోతున్న పిల్లాడిని కాపాడిన పిల్లి, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyపెంపుడు పిల్లి మెట్లపై నుండి పడిపోతున్న పసిబిడ్డను అద్భుతంగా రక్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని హోమ్ కెమెరాలో బంధించారు. పెంపుడు పిల్లి సమయానికి దూకి పాప ప్రాణాలను కాపాడింది.
Wimbledon 2023: వింబుల్డన్‌ 2023 విజేత కార్లోస్‌ అల్‌కరాజ్‌, ఓటమితో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ చేజార్చుకున్న నొవాక్‌ జొకోవిచ్‌
Hazarath Reddyవింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్‌ జొకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బి యా) ఓడిపోయాడు.
Video: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న కారుపై పడిన భయంకరమైన పిడుగు, పెద్ద మంటలతో అల్లకల్లోలమైన రోడ్డు
Hazarath Reddyసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నఓ వీడియోలో రోడ్డుపై కారు వెళుతుండగా,పిడుగు పడటం కనిపిస్తుంది. ఈ పిడుగుపడిన కొద్దిసేపటికి కారు నుంచి నల్లని పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో చూసినవారు భయానికి లోనవుతున్నారు
Woman Married 27 Men: ఫస్ట్ నైట్ అవ్వగానే బంగారం నగదుతో జంప్, 27 మందిని పెళ్ళి చేసుకుని పరారయిన ఓ యువతి, బాధితుల ఫిర్యాదులు విని బిత్తరపోయిన పోలీసులు
Hazarath Reddyజమ్మూకాశ్మీర్‌లో ఓ లేడీ డబ్బుల కోసం ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది. షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
China: బాబోయ్.. బ్రా లోపల ఐదు బతికున్న పాములను పెట్టుకుని మహిళ స్మగ్లింగ్, చైనా ఎయిర్ పోర్టులో పట్టుబడిన ప్రయాణికురాలు
Hazarath Reddyచాలా విచిత్రమైన పనులు చేయడం, దాని కోసం ఇబ్బందులు పడడం అనేవి సర్వసాధారణం. తాజాగా అలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. ఎయిర్‌పోర్టులో ఓ మహిళ తన బ్రాలో ఐదు బ్రతికున్న పాములను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడింది.