Viral

Rs 2000 Notes Deposit in Bank: రూ.2000 నోట్లు రూ. 50 వేల పైన డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు తప్పని సరి, ఈ మొత్తానికి ఆదాయపు పన్నువర్తిస్తుందని తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

బ్యాంకు ఖాతాల్లో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు ప్రస్తుత ఆదాయపు పన్ను ఆవశ్యకత రూ.2,000 నోట్లపై కూడా వర్తిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2000 నోట్లలో రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ అవసరమని ఆయన అన్నారు.

RBI Governor on Rs 2,000 Note: ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధన రూ. 2,000 నోట్లకు కూడా వర్తిస్తుంది, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నాడు రూ. 2,000 నోట్లను, అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం సెంట్రల్ బ్యాంక్ యొక్క కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలలో ఒక భాగమని తెలిపింది.

Salaar Movie Update: సలార్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్, 400 మంది ఫైటర్లతో ప్రభాస్ క్లైమాక్స్‌ ఎపిసోడ్, సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి సలార్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న స్టార్ మూవీ సలార్. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు.

PM Modi Conferred Highest Honour Of Fiji: ప్రధాని మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం, ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ప్రదానం చేసిన ఫిజీ ప్రధాని సితివేణి

Hazarath Reddy

ఫిజీ ప్రధాని సితివేణి రబుకా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫిజీ యొక్క అత్యున్నత గౌరవం "కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ" అని పిఎం మోడీకి ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారని చెప్పబడింది. ఈ గౌరవం నాది మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులది అని ప్రధాని మోదీ అన్నారు

Advertisement

Rs 2000 Note Exchange: రేపటి నుంచి ఏ బ్యాంకులోనైనా రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు, బ్యాంక్ కౌంటర్లలో ఇంతకు ముందు లాగే సేవలు అందించనున్న బ్యాంకులు

Hazarath Reddy

బ్యాంక్ కౌంటర్‌లో రూ. 2000 నోట్లను మార్చుకునే సదుపాయం సాధారణ పద్ధతిలో ప్రజలకు అందించబడుతుంది, అంటే ఇంతకుముందు అందించిన విధంగానే ఈ సేవలు అందిచడం జరుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తెలిపింది. రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవడానికి రేపు, మే 23 నుండి ఏ బ్యాంక్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.

Kerala High Court: సోదరుడి వల్ల గర్భవతి అయిన 15 ఏండ్ల బాలిక.. 7 నెలల గర్భం విచ్చిత్తికి కేరళ హైకోర్టు అంగీకారం

Rudra

సోదరుడి వల్ల ఓ 15 ఏండ్ల బాలిక గర్భవతిగా మారింది. ప్రస్తుతం 7 నెలల గర్భిణి. దీంతో తన గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తిని కేరళ హైకోర్టు అంగీకరించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పుచెప్పింది. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

Viral Video: నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ మూగజీవికి నరకం చూపించి చంపిన యువకుడు.. మధ్యప్రదేశ్ లో హృదయవిదారక ఘటన.. వీడియో ఇదిగో..

Rudra

జాతీయ పక్షి నెమలి ఈకలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడో యువకుడు. బాధ తాళలేక చివరకు అది మరణించింది. తాను చేసిన ఘనకార్యాన్ని వీడియో తీశాడు ఆ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో వెలుగు చూసింది.

Shubman Gill Abused: ఆర్సీబీ ఆశలు చిదిమేసిన గిల్... నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్

Rudra

ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ దశలోకి అడుగుపెట్టాలని ఆశపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభ్ మాన్ గిల్ అడ్డుతగిలాడు. గిల్ సూపర్ డూపర్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ ను గెలిపించగా, ఆర్సీబీ ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఓటమిని జీర్ణించుకోలేని ఆర్సీబీ ఫ్యాన్స్ గిల్ పై నెట్టింట అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Myanmar Earthquake: మయన్మార్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో నమోదు

Rudra

మయన్మార్ లో ఈ ఉదయం 8.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.5గా గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

G20 At Srinagar: నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు.. సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు.. నగరంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

Rudra

జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది.

Satyapal Malik Lashes Out At Centre: కేంద్రాన్ని మళ్లీ టార్గెట్ చేసిన మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమని వ్యాఖ్య.. ఇంకా ఏమన్నారంటే??

Rudra

జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పుల్వామా ఉగ్రదాడిని మరోమారు గుర్తు చేసిన ఆయన.. 2019 నాటి ఎన్నికలు భారత సైనికుల శవాలపై పోరాటమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Rains In Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. వీడియోతో

Rudra

ఎండలతో సతమతం అవుతున్న హైదరాబాదీలకు వరుణుడు కాస్త సాంత్వన కలిగించాడు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌తో పాటూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, శాంలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.

Advertisement

Telangana: పుడ్ డెలివరీ ఇస్తుండగా పైకి దూసుకొచ్చిన కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Hazarath Reddy

రాయదుర్గం పంచవటి కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుడ్‌ డెలివరీ కోసం ఓ భవనంలో మూడో అంతస్తుకు వెళ్లిన డెలివరీ బాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. పుడ్ డెలివరీ ఇస్తుండగా ఇంతలో అక్కడే ఉన్న డాబర్‌ మెన్‌ కుక్క డెలివరీ బాయ్‌ చూడగానే దాడి చేసేందుకు అతని పైకి దూసుకొచ్చింది.

Bengaluru Rains: బెంగుళూరును ముంచెత్తిన భారీ వర్షం, నీట మునిగిన పలు ప్రాంతాలు, అండర్ పాస్‌లో నీరు నిండిపోవడంతో చిక్కుకుపోయిన కార్లు

Hazarath Reddy

బెంగళూరులో ఆదివారం భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసాయి, దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పాటు కేఆర్ సర్కిల్ పరిధిలోని అండర్‌పాస్‌ నీటితో నిండిపోయింది

Weather Update: భారీ వర్షపు సూచన, రెండు రోజుల పాటు 12 జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ, మరో వైపు ఎండలు కూడా మండిపోతాయని హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఉష్ణచలనం కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి సే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.

Bengaluru Rains: బెంగుళూరులో భారీ వర్షం, కారు మునిగిపోవడంతో ఏపీ మహిళ మృతి, నీటితో నిండిపోయిన కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌

Hazarath Reddy

కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ నీటితో నిండిపోయింది. ఇందులో ఏపీకి చెందిన కృష్ణా జిల్లా కారు ఒకటి చిక్కుకుపోయింది.

Advertisement

Relation Tips: మీరు ఒకసారి సెక్స్ చేసినప్పుడు ఎన్ని కేలరీలు కోల్పోతారో తెలుసా, బరువు తగ్గడానికి శృంగారంలో ఏ పొజిషన్ మంచిదో తెలుసుకోండి

Hazarath Reddy

మీరు మార్నింగ్ వాక్ ప్లాన్ చేసే ముందు, మీ కోసం మా దగ్గర ఒక మంచి సూచన ఉంది. మీ కోసం మాత్రమే కాదు, మీ ముఖ్యమైన వ్యక్తి కోసం కూడా. మీ పార్టనర్‌తో బ్రంచ్ ఇచ్చిన క్యాలరీలను సెక్స్ బర్న్ చేస్తుందని మీకు తెలుసా? మీ బరువు, మీరు మంచం మీద గడిపే సమయం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో మీకు సహాయపడతాయి.

Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!

Rudra

2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.

Rains In AP: ఏపీకి చల్లని కబురు.. నేడు పలుచోట్ల వర్షాలు.. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Rudra

మండుటెండలు, వడగాలులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Bro Shooting: 'బ్రో' సెట్స్ పైకి పవన్ సూపర్ ఎంట్రీ... వీడియో వైరల్

Rudra

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan), యువనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రో' సెట్స్ (BRO Sets) పైకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.

Advertisement
Advertisement