వైరల్

Ayodhya Deepotsav 2024: అయోధ్యలో అంబరాన్ని అంటిన దీపావళి వేడుక సంబరాలు, సరయూ ఘాట్ వద్ద లేజర్, లైట్ షో వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద లేజర్ మరియు లైట్ షో జరుగుతోంది. ఘాట్ దీపాలు మరియు రంగురంగుల లైట్లతో, రామ్ లీలా గురించి సౌండ్-లైట్ షో ద్వారా వివరించబడుతోంది. డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Chennai Shocker: చెన్నైలో దారుణం, మహిళా టీచర్‌కి మత్తు ఇచ్చి రాత్రంతా శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా కొరుకుతూ గే సెక్స్‌కి పాల్పడిన ప్రధానోపాధ్యాయురాలు, అరెస్ట్

Hazarath Reddy

టీచర్ ని ఇంటికి పిలిపించిన ప్రధానోపాధ్యాయురాలు తాగేందుకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చింది. అది తాగిన టీచర్ అదమరిచి నిద్రపోయింది. నిద్ర లేచి చూసేసరికి శరీరం నిండా గాయాలున్నట్లు తేలింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రధానోపాధ్యాయురాలు మహిళా టీచర్‌ను ఇంట్లోనే ఉంచి తాళం వేసింది.

Vijayasai Reddy on Chandrababu: బాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు, కరువు కవల పిల్లలు, ఏపీ ఐదు జిల్లాల్లో 54 కరువు మండలాల జీవో ప్రకటనపై విజయసాయిరెడ్డి సెటైర్

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది.

Jaunpur Horror: యూపీలో దారుణం, భూవివాదంలో యువకుడిని చంపి తలను మొండెం నుంచి వేరు చేసిన ప్రత్యర్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కబీరుద్దీన్‌పూర్ గ్రామంలో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి, అతని తలను శరీరం నుండి వేరు చేశారు. భూ వివాదానికి సంబంధించిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

Advertisement

Viral Video: దేవుడు తిరిగి బ్రతికిస్తాడని బిల్డింగ్‌ పై నుండి దూకిన యువకుడు, కాళ్లు-చేతులు విరిగి ఆస్పత్రిపాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అని బిల్డింగ్ పైనుంచి దూకాడు ఓ యువకుడు. తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని, దేవునితో తాను మాట్లాడానని‌‌‌‌... నేను చనిపోయిన బతుకుతానని పిచ్చి నమ్మకంతో నాలుగవ అంతస్తు నుండి దూకాడు. తీరా చేతులు, కాళ్లు విరిగి తల తీవ్రమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

November 2024 Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు జాబితా ఇదిగో, మొత్తం 13 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్

Vikas M

అక్టోబర్ నెల మరో రెండు రోజుల్లో ముగియనుండగా శుక్రవారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంకు ఖాతాదారుడు తమ బ్యాంకు శాఖలను కొన్ని పనులకు తప్పక సందర్శించాల్సి వస్తోంది.

Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చుక్కలే, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మరి

Hazarath Reddy

ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు ఎక్కేందుకు మహిళా ప్రయాణికులు పడిన అవస్థల వీడియో వైరలవుతుంది.

Drainage Water Flooded On Delhi Roads: డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో)

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి వరద నీరు ఏరులై పారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.

Advertisement

APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బస్సును ఆపి.. ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు డ్యాన్స్ చేసి ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మళ్లీ విధుల్లో చేరాడు.

Andhra Pradesh: పవన్ కళ్యాణ్ గెలిచాడని వీర అభిమాని సాహసం, విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు పాదయాత్ర, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు

Army Dog Phantom Died: ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఆర్మీ డాగ్ ఫాంటమ్.. జమ్ముకశ్మీర్ లో ఘటన

Rudra

భారత సైన్యానికి చెందిన శునకం ఫాంటమ్ వీరమరణం పొందింది. జమ్ముకశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్‌ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం ఎనిమిది గంటలపాటు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Karnataka: వీడియో ఇదిగో, వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ దిగుతూ నీటిలో కొట్టుకుపోయిన యువతి, 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆమెను రక్షించిన పోలీసులు

Hazarath Reddy

తుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలోని సరస్సుపై రాళ్లతో కూడిన ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ బండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఓ యువతి సోమవారం బయటపడిందని పోలీసులు తెలిపారు.

Advertisement

B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్‌ విద్యార్థి (వీడియో)

Rudra

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్‌ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.

Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చ‌నిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృత‌దేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)

Rudra

బయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు వాళ్లు. వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.

Firecracker Explodes In Hyderabad: హైదరాబాద్ లోని యాకుత్‌ పురాలో ఓ ఇంట్లో బాణ‌సంచా పేలుడు.. దంప‌తులు మృతి (వీడియో)

Rudra

హైద‌రాబాద్ లోని యాకుత్‌ పురాలో ఘోరం జరిగింది. ఇంట్లో బాణ‌సంచా పేలి ఇద్ద‌రు దంప‌తులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.

Firecracker Explodes at Kerala Temple: కేరళ ఆలయంలో భారీ పేలుడు.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం.. బాణసంచా పేలుస్తుండగా ఘటన (వీడియో)

Rudra

కేరళలో కాసర్‌ గోడ్ జిల్లాలోని నీలేశ్వరంలో గల ప్రఖ్యాత అంజుతాంబళం వీరార్కవు ఆలయంలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 150 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.

Advertisement

Ranjith Balakrishnan Sexually Assaulting Case: ‘ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. ఆడిష‌న్ సాకుతో దుస్తులు విప్పించి ఆ తర్వాత..’ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్ పై న‌టుడి ఫిర్యాదు

Rudra

ఒకవైపు మాలీవుడ్‌ లో ‘మీ టూ’ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్న సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్‌ తనను లైంగికంగా వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ పై కేసు న‌మోదైంది.

ANR National Award 2024: నాగేశ్వరరావు ఓ ఎన్‌సైక్లోపీడియా, భావోద్వేగానికి గురైన చిరంజీవి, తన తండ్రి నన్ను ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్న మెగాస్టార్

Vikas M

ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, ఇతరుల నుంచి తనకు చక్కటి ప్రశంసలు వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు.

ANR Award: వీడియో ఇదిగో, అమితాబ్ బచ్చను పాదాలకు నమస్కరించిన చిరంజీవి, ANR నేషనల్ అవార్డును మెగాస్టార్‌కు అందించిన బాలీవుడ్ బిగ్ బీ

Vikas M

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని BIG B అమితాబ్ బచ్చన్ సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు చిరంజీవిని ANR జాతీయ అవార్డుతో సత్కరించారు. చిరంజీవికి అవార్డును అందించడానికి ముందు, బిగ్ బి తన ప్రసంగంలో నటుడి గురించి గొప్పగా మాట్లాడారు.

Diwali 2024: దీపావళి రోజు ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది, పండితులు ఏమి చెబుతున్నారంటే..

Vikas M

హిందూవుల ముఖ్య పండుగ దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.

Advertisement
Advertisement