Newyork, June 2: అమెరికా అధ్యక్షుడు (America President) జో బైడెన్ (Joe Biden) కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో (Colorado US Air Force Academy) గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది (Security Force) ఆయనను పైకి లేపారు. ఆ వెంటనే ఆయన ఎలాంటి సాయమూ లేకుండానే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని వైట్‌హౌస్ ప్రకటించింది. అధ్యక్షుడు కింద పడిన వీడియో వైరల్ అవుతోంది.
WATCH: President Biden falls hard after tripping over a black sandbag on stage at the US Air Force Academy commencement. @WTRF7News #Biden #POTUS https://t.co/Zi7nGGcsj6 pic.twitter.com/MzujGBFaqi
— John Lynch (@JohnArdenLynch) June 1, 2023
గతంలో కూడా..
80 ఏళ్ల వయసులో అమెరికాకు అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన బైడెన్ గతంలోనూ పలుమార్లు ఇలానే తూలిపడ్డారు. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్‌లో బైక్ రైడింగ్ చేస్తూ ఒకసారి కిందపడ్డారు. ఒకసారి ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానం ఎక్కుతూ మెట్లపై తూలిపడ్డారు.