Hangout Thief: కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూయించిన ప్రయాణికుడు.. ఏం చేశాడంటే?
బిహార్లోని ఖగారియా స్టేషన్వద్ద కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు ఓ దొంగ. దీనిని గమనించిన ప్రయాణికుడు దొంగ మరో చేయిని పట్టుకున్నాడు. 15 కిలోమీటర్ల దూరం పాటు రైలుకు వేలాడుతూనే ప్రయాణించాడు.
Patna, September 16: కదులుతున్న రైల్లో (Train) నుంచి ఫోన్ (Mobile) దొంగతనానికి (Theft) యత్నించి దొరికిపోయాడు ఓ వ్యక్తి. బిహార్లోని ఖగారియా స్టేషన్వద్ద కదులుతున్న రైలు కిటికీలో (Window) నుంచి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ప్రయాణికుడు దొంగ మరో చేయిని పట్టుకున్నాడు. 15 కిలోమీటర్ల దూరం పాటు రైలుకు వేలాడుతూనే ప్రయాణించాడు. తనను వదిలిపెట్టాలంటూ దొంగ ప్రాధేయపడినా పట్టించుకోకుండా తర్వాత స్టేషన్ వచ్చేవరకు పట్టుకున్నారు. సాహెబ్పుర్ చేరుకున్న అనంతరం పోలీసులకు అప్పగించారు. దీనిని ఓ ప్రయాణికుడు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగను సాహెబ్పుర్కు చెందిన పంకజ్ సింగ్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Bad day for this thief.
He was trying to snatch mobile but caught in the hands of The Family man 🤣😂 in Samastipur-Katihar Passenger Train
Later he was handed over to Police#Begusarai #Bihar #ViralVideo pic.twitter.com/myS1CY7tXK
— Dhiren Patel (@DhirenP66827872) September 15, 2022
(The above story first appeared on LatestLY on Sep 16, 2022 09:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

