కేరళకు చెందిన వైద్యుడు తన భార్యతో ఇటలీ వెళ్లగా అక్కడ భయంకరమైన అనుభవం ఎదురైంది. అక్కడ ట్రైన్ ప్రయాణంలో వారికి చెందిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు (Kerala Couple Lose Passports in Italy) కొట్టేశారు. చివరికి కాంగ్రెస్ ఎంజీ శశిథరూర్ జోక్యంతో అత్యవరసర పాస్‌పోర్ట్‌ల జారీలో భారత కాన్సులేట్ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
కేరళకు చెందిన డయాబెటిక్ రీసెర్చ్ చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే రైలు రావడంతో లగేజీతో ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న సమయంలో వీరి బ్యాగును ఓ దుండుగుడు కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత విషయం తెలుసుకున్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.వారు భారత కాన్సులేట్‌ను సంప్రదించమని సూచించారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి నాగేంద్రుడు.. శివలింగం చుట్టూ ప్రదక్షిణలు.. నిర్మల్ లో ఘటన
చేసేదేమి లేక తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ని సంప్రదించారు. ఆయన ఇటలీలోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించడం, ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్‌పోర్ట్‌ను ఏర్పాటుచేయడం చకచకా జరిగిపోయాయి.
Here's News
Glad it all worked out in the end @jothydev ! So pleased our consulate did what was needed so well. @MEAIndia https://t.co/2pTt4DFd4u
— Shashi Tharoor (@ShashiTharoor) March 11, 2024
దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్‌పోర్ట్‌లను కాన్సులేట్ అందించారు. దీనికి సంబంధించిన భయంకర అనుభవాన్ని జోతిదేవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్‌పోర్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు.