
Nirmal, Mar 10: నిర్మల్ (Nirmal) జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసేర్యాల శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి నాగేంద్రుడు (Snake) దర్శనమిచ్చాడు. గర్భగుడిలో పుట్ట ఉండగా.. ఏటా మూడు, నాలుగుసార్లు కనిపిస్తుంది. తాజాగా శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం జరుగుతున్న సమయంలో నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది. గర్భగుడిలో శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం ఉదయం వరకు ఆలయ పరిసరాల్లో తిరుగుతూ కనిపించింది. గర్భగుడిలోని శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారింది.
