'Boycott TikTok': చైనాపై నెటిజన్ల ఫైర్, ప్రపంచదేశాల వినాశనానికి చైనానే కారణమంటూ ఆగ్రహం, #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం
Flag of China (photo Credits: PTI)

Mumbai, April 7: చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ (Wuhan Virus) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 209 దేశాలు, ప్రాంతాలకు వ్యాప్తించింది.అంతర్జాతీయంగా దేశాలకు దేశాలే లాక్ డౌన్ (Lockdown) లోకి వెళ్లిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 13,49,821 లక్షల మంది దీని బారిన పడగా.. 74,820 వేల మంది మృత్యువాత పడ్డారు. కాగా కరోనా బాధితుల సంఖ్య అగ్రరాజ్యం అమెరికాలో (America) అధికంగా ఉంది. అక్కడ 3,67,629 మందికి కరోనా సోకగా.. 10,981 మంది ప్రాణాలు కోల్పోయారు.

కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రీ కొడుకుల వీడియో

ఇక కోవిడ్‌ 19 కేసులు ఎక్కువగా నమోదైన దేశాల్లో స్పెయిన్‌ (Spain) రెండో స్థానంలో, ఇటలీ (Italy)ముడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు కరోనాపై పోరాటం చేస్తూ.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తున్నాయి. ఇక ఇండియాలో (India) కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4421కు చేరుకోగా మరణాల సంఖ్య 114కి చేరింది.

Here's Twitter Trend

China is the enemy, they unleashed the Corona Virus on the world, they lie, steal, threaten, and are coming for the domination of Canada. Say no to any & all Chinese ownership in Canada. Boycott anything & everything Chinese including their spy tool Huawei.#BoycottChina pic.twitter.com/AuB0UHXsqj

ఈ వినాశనానికి చైనానే కారణమని, ప్రారంభ దశలోనే వైరస్‌ను చైనా (China) కట్టడి చేయలేకపోయిందని ప్రపంచ దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #MakeChinaPay, #ChinaLiedPeopleDied అనే హ్యష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక ఈ ప్రభావం ఇండియాలోనూ అధికంగానే ఉంది. వైరస్‌ వ్యాప్తికి కారణమైందన్న కోపంతో ఇప్పటికే అనేక మంది చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరిస్తున్నారు.

Here's Twitter Trend

ఇక చాలామంది చైనా యాప్‌ టిక్‌టాక్‌ను కూడా తమ మొబైల్స్‌ నుంచి తొలిగించేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం కరోనాను ‘చైనా వైరస్‌’ లేక వుహాన్ వైరస్ అని సంబోధించిన విషయం తెలిసిందే. చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం. భారత్‌ టిక్‌టాక్‌ వాడకాన్ని నిలిపివేస్తే చైనా దాదాపు రోజుకి 1 మిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోతుందని, 250 మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోతారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Here's Tweets

 

ఇదిలా ఉంటే చైనా సంస్థ బైట్‌డాన్స్‌ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్‌ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. టిక్‌టాక్‌ యూజర్లలో కనీసం సగం మంది ఇండియాకు చెందిన వారే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారతీయులు రోజులో సగటున 52 నిమిషాలు పాటు టిక్‌టాక్‌లో గడుపుతున్నట్లు వెల్లడైంది.