Credits: Twitter

Mumbai, July 31: మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్  (Palghar Railway Station) సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ ప్రెస్ (Jaipur-Mumbai Express) రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ (RPF ASI), ముగ్గురు ప్రయాణీకులు ఉన్నారు. నేటి తెల్లవారు జామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జైపూర్ ఎక్స్‌ ప్రెస్ రైలు (Jaipur Express Train)  జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ (Chetan Singh) గా గుర్తించారు.

TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

రైలు బయటకు దూకగా..

కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ సమీపంలో నిందితుడు రైలు బయటకు దూకగా, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు.

Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు