RRR look inspire Ganesha idol makers (Photo-Twitter)

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ మొదలైంది. నవరాత్రి ఉత్సవాలు జరిపేందుకు ప్రతివీధిలోనూ మండపాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి సంబరాలతో ప్రధాన నగరాలన్నీ సందడిగా మారాయి.. ఏ గల్లీలో అడుగు పెట్టినా గణనాథుని రూపాలే దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రదేశాల్లో డిఫరెంట్‌ గణేష్‌ రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. చాలా చోట్ల సినిమాలకు సంబంధించిన హీరోల రూపాలతో గణేశుబి విగ్రహాలను తయారుచేశారు.

ఈద్గా మైదానంలో వినాయకుడికి తొలిరోజు పూజలు, హుబ్బళ్లి-ధర్వాడ్‌లో ఉన్న ఈద్గా మైదానంలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి

ఇక వినాయక విగ్రహాల మీద సినిమాల ప్రభావం కూడా చాలానే ఉంది. గత కొన్నేళ్లుగా సినిమాలోని హీరోలు, వారు పోషించిన పాత్రల రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొందరి హీరోల రూపంలో ప్రతిష్టించారు. ఓచోట పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. మరో చోట ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ బొమ్మతో విగ్రహాన్ని తయారు చేశారు. మరోచోట ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్‌లో పరుగెడుతూ ఉన్నటువంటి, బాణాన్ని ఎక్కుపెడుతున్న గెటప్‌లో ఉన్నాడు గణేషుడు.. అలాగే ఎన్టీఆర్‌ భీం రూపంలో..కేజీఎఫ్‌లో యశ్‌ రూపంలో విఘ్నేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.సాధారణ జనాలు సైతం ఆ విగ్రహాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి విగ్రహాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Here's Videos