Ghana: ఇదేం ట్విస్టు బాబోయ్.. నిద్రలో మేకను కోస్తున్నట్లుగా కలగంటూ అవి కోసేసుకున్నాడు, పురుషాంగం తెగి చేతిలో పడటంతో లబోదిబో మంటూ ఆస్పత్రికి పరుగులు

ఘనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మేకను వధించాలని కలలు కంటూ ప్రమాదవశాత్తూ తన పురుషాంగం మరియు వృషణాలను (Ghana Man chops off his own penis) కోసుకున్నాడు.

Ghana: ఇదేం ట్విస్టు బాబోయ్.. నిద్రలో మేకను కోస్తున్నట్లుగా కలగంటూ అవి కోసేసుకున్నాడు, పురుషాంగం తెగి చేతిలో పడటంతో లబోదిబో మంటూ ఆస్పత్రికి పరుగులు
Man chops off his own penis

ఘనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మేకను వధించాలని కలలు కంటూ ప్రమాదవశాత్తూ తన పురుషాంగం మరియు వృషణాలను (Ghana Man chops off his own penis) కోసుకున్నాడు.నిద్రమ‌త్తు వ‌దిలాక విష‌యం తెలుసుకుని ల‌బోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెట్టాడు. ఘ‌నాలోని అసిన్ ఫోసు ప‌ట్ట‌ణానికి చెందిన రైతు కోఫీ అట్టా (42) భార్య ఊరెళ్లడంతో.. అత‌నొక్క‌డే ఇంట్లో ఉన్నాడు.ఓ రోజు కుర్చీలో కూర్చొని కునుకు (Half-asleep man) తీస్తున్నాడు.

నిద్రలో లంచ్ కోసం అత‌డి భార్యకు స‌హాయం చేసేందుకుగానూ మేక‌ను కోస్తున్న‌ట్లు (dreaming of cutting meat) క‌ల క‌న్నాడు. అలా కల కంటూనే క‌త్తి తీసుకొని నిజంగానే మేకను వధిస్తున్నట్లుగా త‌న పురుషాంగంతోపాటు జ‌న‌నేంద్రియాల‌ను (Man cuts off his own penis) కోసుకున్నాడు. వెంటనే విప‌రీత‌మైన నొప్పిరావ‌డంతో మేల్కొన్నాడు. జరిగిన విష‌యం తెలుసుకుని షాక్ తో గ‌ట్టిగా అరిచాడు.

కండోమ్ లేకుండా పురుషులతో సెక్స్, ఒకేసారి శరీరంలోకి మంకీపాక్స్,కోవిడ్-19,హెచ్‌ఐవి వ్యాధులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇటలీకి చెందిన వ్యక్తి

పొరుగువారు గ‌మనించి అత‌డి భార్య‌కు స‌మాచార‌మందించారు. కొద్దిసేప‌టికే అట్టా భార్య అడ్వోవా కోనాడు ఇంటికి చేరుకుంది. భ‌ర్త జ‌న‌నాంగాల‌నుంచి ర‌క్తం కారుతుండ‌గా డైప‌ర్ వేసి, ఆస్పత్రికు తీసుకెళ్లింది.బాధితుడిని మొదట అసిన్ ఫోసులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కాథలిక్ ఆస్పత్రిలో చేర్చారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం అత‌డిని కోంఫో అనోకీ టీచింగ్ హాస్పిట‌ల్‌కు త‌రలించారు. ఆరు వారాల శస్త్రచికిత్స తర్వాత తిరిగి అత‌డి పురుషాంగాన్ని అతికించొచ్చ‌ని వైద్యులు తెలిపారు. అంగం ప‌నితీరు య‌ధావిధిగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.అతనికి శస్త్రచికిత్స చేయవలసి ఉందని, దాని కోసం అతను డబ్బును సేకరిస్తున్నాడని వైద్యులు చెప్పారు.

(The above story first appeared on LatestLY on Aug 24, 2022 12:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).