Newdelhi, May 6: వెరిఫైడ్ అకౌంట్లకు (Verified Accounts) ట్విట్టర్ (Twitter) ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ (Tick Mark) ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ (Gmail) కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ (Blue Tick Mark) కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్ (Google) రంగంలోకి దిగింది. వెరిఫైడ్ ఈమెయిల్ అకౌంట్లకు ఈ టిక్ మార్కు ఇస్తామని తాజాగా వెల్లడించింది. ఈమెయిల్ పంపిన వారి పేరు పక్కనే ఈ మార్కు కనిపిస్తుందని పేర్కొంది. సంస్థ ప్రకటన ప్రకారం, గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్లు, లెగసీ జీ సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్లు, వ్యక్తిగతంగా వెరిఫైడ్ జీమెయిల్ అకౌంట్ కలిగిన వారకీ ఈ టిక్ మార్కును కేటాయిస్తారు.
#Gmail introduces #BlueTick to verify senders, keep phishing emails at bay.https://t.co/n2rZlREwhw
— Kloud Crunch (@CrunchKloud) May 5, 2023
ఎందుకంటే?
బ్లూ టిక్ మార్క్ సాయంతో వినియోగదారులు నకిలీ అకౌంట్ల నుంచి వచ్చే ఫిషింగ్ దాడులనుంచి తమని తాము కాపాడుకోవచ్చని గూగుల్ పేర్కొంది. ఇక బీఐఎమ్ఐను వినియోగిస్తున్న సంస్థలన్నిటీకి ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ మార్క్ జారీ అవుతుంది. అయితే, ఈ టిక్ మార్క్ ను గూగుల్ ప్రస్తుతానికి ఉచితంగానే జారీ చేస్తోంది.