Newdelhi, Dec 8: దొంగలు (Thieves) తెలివిమీరి పోతున్నారు. అసలు టోల్ ప్లాజాకు (Toll Plaza) వెళ్ళకుండా నకిలీ టోల్ ప్లాజా (Fake Toll Plaza)ను ఏర్పాటు చేసిన దుండగులు ఏకంగా రూ. 75 కోట్లు కొట్టేశారు. ఎట్టకేలకు ఆ దొంగలను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోర్బి జిల్లాలో సుమారు ఏడాది నుంచి నిర్వహిస్తున్న ఈ నకిలీ టోల్ ప్లాజా ద్వారా నిందితులు 75 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికంగా పలుకుబడి ఉన్న ఒక నేత కుమారుడు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
In Gujarat, after fake government offices, now a fake toll plaza https://t.co/sY5zFOpzmR
— ParanjoyGuhaThakurta (@paranjoygt) December 6, 2023
బంబన్‌బోర్-కుచ్ నేషనల్ హైవేపై మోర్బి-వాంకనర్ ఊర్ల మధ్య వఘాసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఆ టోల్ ప్లాజా తగలకుండా నిందితులు అక్కడ ఉన్న సిరమిక్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డును మళ్లించి కొత్త రోడ్డు వేసి మధ్యలో నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.