Agra, Nov 13: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో ఘోరం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రా (Agra)లో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై (Homestay Employee) ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు మైనర్ కూతుళ్లు ఉన్నారు.. వదిలిపెట్టాలని వేడుకున్నా ఆమెను నిందితులు వదిలిపెట్టలేదు.
"Pls save me, I have minor daughters.."
This horrifying incident took place in Agra, UP where a woman was gang-raped and beaten up in broad daylight.
Jitendra Rathore, two others & a woman are the culprits. Yogi govt has completely failed to ensure women's safety in UP. pic.twitter.com/iU0qtyhZYy
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) November 12, 2023
బాధితురాలి వీడియో గతంలోనే..
పోలీసుల కథనం ప్రకారం.. 25 ఏళ్ల బాధితురాలి వీడియోను గతంలోనే చిత్రీకరించారు. దానిని చూపించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధిత యువతితో మద్యం తాగించిన నిందితులు ఆ తర్వాత ఆమె తలపై గాజు సీసాను పగలగొట్టారు. సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియో వైరల్ అయినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం ఆరోపణలతోపాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినట్టు పేర్కొన్నారు.