Newdelhi, Nov 13: నిషేధిత రసాయనాలతో తయారు చేసిన పటాకులపై (Crackers) నిషేధం విధిస్తూ నవంబర్ 7న సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలను పలువురు ఢిల్లీ (Delhi) వాసులు పక్కనపెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పటాకులను కాల్చారు. షాపూర్ జాట్, హౌజ్ ఖాస్ ప్రాంతాల్లో పటాకుల మోత వినిపించింది. ఆంక్షలు ఉన్నప్పటికీ పటాకులు పేల్చడంపై పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి స్పందించారు. తన నివాస ప్రాంతం డిఫెన్స్ కాలనీలో కూడా పటాకులు పేలినట్లు ఆమె చెప్పారు. డిఫెన్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదులు చేసినా ఎలాంటి మార్పు రాలేదని, పటాకుల పొగలో సుప్రీంకోర్టు లక్ష్యం ఎగిరిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. హెచ్చరికలు, పూర్తి నిషేధం ఆంక్షలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు మరోసారి విఫలమయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు.

CM KCR Meetings: నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ సభ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)