Hyderabad, Nov 13: హైదరాబాద్ (Hyderabad) లోని రెండు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు (Fire Accidents) సంభవించాయి. ఈ ఘటనల్లో లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అమీర్ పేట్ (Ameerpet), పాత బస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్ పేట్ పరిధిలోని మధురానగర్ లో గల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్ కాలి బూడిదైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో..
పాతబస్తీలో కూడా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలోని షాలిబండ ఏరియాలోగల బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దుకాణంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ రెండు ప్రమాదాలకుగల కారణాలు తెలియాల్సి ఉంది.