Credit@ BCCI twitter

Bangalore, NOV 12: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా (INDIA) విజ‌య‌యాత్ర కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీఫైన‌ల్‌కు (Semis) చేరుకుంది. ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో (IND Vs NED) జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 411 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్స్ 47.5 ఓవ‌ర్ల‌లో 250 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 160 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. నెద‌ర్లాండ్స్ (Netherlands) బ్యాట‌ర్ల‌లో మాక్స్‌ ఔడౌడ్ (30), అకెర్మాన్ (35) లు రాణించారు.

 

అంత‌కు ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 410 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (128 నాటౌట్; 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (102; 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) సెంచ‌రీల‌తో వీర‌విహారం చేయ‌గా, రోహిత్ శ‌ర్మ (61; 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (51; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ల‌తో విరాట్ కోహ్లీ (51; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) లు అర్ధ‌శ‌త‌కాల‌తో క‌దంతొక్కారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో బాస్ డి లీడే రెండు వికెట్లు తీయ‌గా, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్(Rohit Sharma), గిల్ లు శుభారంభాన్ని ఇచ్చారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. పోటాపోటీగా బౌండ‌రీలు బాదారు. ఈ క్ర‌మంలో గిల్ 30 బంతుల్లో, రోహిత్ 44 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాల‌ను పూర్తి చేసుకున్నారు. మొద‌టి వికెట్‌కు 11.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే వీరిద్ద‌రు పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కోహ్లీ.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు.

 

53 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసి జోరుమీదున్న కోహ్లీని (Virat kohli) మెర్వే ఔట్ చేశాడు. ఈ ద‌శ‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో (Shreyas Ayyar) జ‌త‌క‌లిసిన కేఎల్ రాహుల్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. మొద‌ట శ్రేయ‌స్ 84 బంతుల్లో ఆ త‌రువాత కేఎల్ రాహుల్ (Kl Rahul) 62 బంతుల్లో సెంచ‌రీలు చేశారు. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాహుల్ అయ్యాడు. శ్రేయ‌స్‌, రాహుల్ జోడి నాలుగో వికెట్‌కు ఏకంగా 208 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న రెండో అత్యుత్త‌మ స్కోరును న‌మోదు చేసింది. కాగా.. కేఎల్ రాహుల్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌రుపున వేగ‌వంత‌మైన శ‌త‌కం బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.