Chennai, June 12: పెళ్లై (Marriage) కొత్తగా మొదలైన జీవితంలో మధురానుభూతులను నింపుకోవాలనుకొన్న ఆ జంటకు విషాదమే ఎదురైంది. హనీమూన్ (Honeymoon) కోసం ఇండోనేషియా (Indonesia) వెళ్లిన నవదంపతులు బోటు (Boat) బోల్తా పడటంతో సముద్రంలో పడి దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు(Tamilnadu)లోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఇటీవలే వివాహం జరిగింది. నూతన దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు.
A recently married doctor couple from Poonamallee drowned during their honeymoon in Bali, while they were riding a water bike, during a photoshoot. https://t.co/L0czyfk8u5
— The Times Of India (@timesofindia) June 11, 2023
అక్కడ ఏం జరిగిందంటే?
బాలీ ద్వీపానికి వెళ్ళిన ఈ జంట ఈ నెల 9న వారు బోటులో ఫోటోషూట్ కోసం షికారుకు వెళ్లారు. అయితే, అకస్మాత్తుగా పడవ బోల్తా పడటంతో దంపతులు నీట మునిగి మృతి చెందారు. లోకేశ్వరన్ మృతదేహాన్ని వెంటనే వెలికితీయగా, విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం లభ్యమైంది. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.