Pradeep Krishnan: తాత.. చిన్నప్పుడు మీరు నన్ను స్కూటర్ పై తిప్పారు.. ఇప్పుడు మిమ్మల్ని విమానంలో తీసుకుపోతా.. నెటిజన్లను ఫిదా చేస్తున్న భావోద్వేగ వీడియో మీరూ చూడండి!!
‘తాత.. చిన్నప్పుడు మీరు నన్ను స్కూటర్ పై తిప్పారు.. ఇప్పుడు మిమ్మల్ని విమానంలో తీసుకుపోతున్నా’ అంటూ ఓ మనుమడు చేసిన అనౌన్స్ మెంట్ యావత్ ఇంటర్నెట్ జనాల్ని భావోద్వేగాలకు గురిచేస్తున్నది.
Chennai, Apr 6: ‘తాత.. చిన్నప్పుడు మీరు నన్ను స్కూటర్ పై (Scooter) తిప్పారు.. ఇప్పుడు మిమ్మల్ని విమానంలో తీసుకుపోతున్నా’ అంటూ ఓ మనుమడు చేసిన అనౌన్స్ మెంట్ యావత్ ఇంటర్నెట్ జనాల్ని భావోద్వేగాలకు గురిచేస్తున్నది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే విమానంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. టేకాఫ్‌కు సిద్ధమైన విమానం కేబిన్ లోకి వచ్చిన పైలట్ (Pilot) ప్రదీప్ కృష్ణన్ (Pradeep Krishnan) చేసిన అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిస్తే, తల్లిదండ్రులను భావోద్వేగానికి గురిచేసింది. ‘చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈ రోజు అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. మా తాత ఈ రోజు మొదటిసారి నాతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఆయన నన్ను ఎన్నోసార్లు తన స్కూటర్‌పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయనను విమానంలో ఎక్కించుకున్నాను’ అని ప్రదీప్ పేర్కొన్నారు.
#IndiGo pilot flies grandfather for the first time: ‘I travelled on his TVS many times, now my turn to give him a ride'https://t.co/Fq40rjveWt
— Hindustan Times (@htTweets) April 5, 2024
View this post on Instagram
అంతటా సంబురం
కొడుకు తమ గురించి చెబుతుంటే ఆయన తల్లి ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తల్లి, తాత, బామ్మను ప్రదీప్ ప్రయాణికులకు పరిచయం చేయగానే విమానంలోని ప్రయాణికులంతా ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. వీడియో చూసిన నెటిజన్లు వారికి జతకూడారు.
(The above story first appeared on LatestLY on Apr 06, 2024 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

