Bengaluru, July 29: నాలుగు బెడ్ రూంలు ఉన్న ఓ ఫ్లాట్ అద్దె (Flat Rent) నెలకు ఏకంగా రూ. 2.5 లక్షలట. ఇదే ఎక్కువనుకుంటే..రూ.25 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit) కూడా చెల్లించాలట. బెంగళూరులో (Bengaluru) ఇంటి అద్దెలు ఇలాగ ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 5,195 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉందని ఆ నెటిజన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ అంశం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
They should add an option:
Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF
— Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023
లోన్ పొందే ఆప్షన్
ప్రకటన కిందే లోన్ పొందే ఆప్షన్ కూడా ఉండటంతో జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. లోన్ ఆప్షన్‌తో పాటూ పక్కనే కిడ్నీ దానానికి సంబంధించి ఆప్షన్ కూడా ఉంటే బాగుండేదంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.