World’s Shortest Doctor: మూడు అడుగుల పొడవు ఉన్న ఇతను ప్రపంచంలోనే అతి పొట్టి డాక్టర్.. వైద్యుడు కావాలన్న ఆయన కల అంత సులువుగా సాకారం కాలేదు. ఎన్ని కష్టాలు ఎదురయ్యాయంటే?
World’s Shortest Doctor (Credits: X)

Gandhinagar, Mar 8: గుజరాత్ ​కు (Gujarat) చెందిన గణేశ్ బరైయా (Ganesh Baraiya) వయసు 23 ఏళ్లు. అరుదైన వ్యాధి కారణంగా ఆయన ఎత్తు 3 అడుగులుగా, బరువు 18 కిలోలు మాత్రమే పెరిగాడు. అయినప్పటికీ డాక్టర్ కావాలన్న తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్ లో 233 మార్కులు సాధించారు. అయితే ఎత్తును కారణంగా చూపించి.. మెడికల్ కోర్సులో ప్రవేశానికి గణేశ్ బరైయాకు మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడా చుక్కెదురైంది.

Saudi Robo Bad Touch: మహిళా రిపోర్టర్‌ ను అనుచితంగా తాకిన సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో.. వీడియో ఇదిగో!

దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గణేశ్ ​కు మెడికల్ కాలేజీలో ప్రవేశం కల్పించాలని.. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. దీంతో గుజరాత్‌ లోని భావ్​ నగర్ వైద్య కళాశాలలో గణేశ్ బరైయాకు ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ఇటీవలే కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు.