Nepal Earthquake Again: నేపాల్‌ లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి భూకంపం.. తీవ్రత 3.6గా నమోదు.. అయోధ్యలోనూ కంపించిన భూమి.. శుక్రవారం భూకంప ఘటనలో 157కు చేరిన మరణాలు
Nepal Earthquake (Credits: X)

Newdelhi, Nov 5: హిమాలయ దేశం నేపాల్‌ లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి. ఉదయం 4.38 గంటలకు రాజధాని కఠ్మండూలో (Kathmandu) భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కఠ్మండూకు 169 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.

Baby Girl Survives Miraculously: ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల పసి పాప

Mukesh Ambani: ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. నిందితులు తెలంగాణ, గుజరాత్ వాసులే

అయోధ్యలోనూ..

అంతకు ముందు భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఉన్న అయోధ్యలో (Ayodhya) కూడా భూమి కంపించింది. ఆదివారం వేకువజామున 1.07 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అదేవిధంగా అఫ్ఘానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో (Fayzabad) కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.25 గంటలకు ఫైజాబాద్‌లో 4.5 తీవ్రతతో భూమి కంపించింది.

157 మంది మరణం..

శుక్రవారం రాత్రి 11.32 గంటలకు నేపాల్‌ లోని జాజర్‌కోట్‌ (Jajarkot)లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో 157 మంది మరణించగా, డజన్ల కొద్ది జనాలు గాయపడ్డారు. భారీగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. వంల కొద్ది ఇండ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే.

L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ