Credits: Twitter

Bhopal, Feb 13: కొన్ని వార్తలు చదవగానే ఆశ్చర్యంతో పాటు కాస్త అసహనం కూడా కలిగిస్తాయి. ఇదీ అలాంటి వార్తే. రైల్వే భూముల్ని(Railway Lands) ఆక్రమించాడని ఆరోపిస్తూ అధికారులు దేవుడికే నోటీసులు (Notices) పంపిన విచిత్రమిది.  అవును! రైల్వే భూమిని హనుమంతుడు (Lord Hanuman) ఆక్రమించాడట. వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే తదుపరి చర్యలు తప్పవంటూ మధ్యప్రదేశ్ లోని (Madhyapradesh) ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్  అధికారులు నోటీసులు పంపారు.

టీ 20 మహిళా ప్రపంచ కప్ బోణీ అదిరింది, పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం, ఏడు వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసిన టీమిండియా మహిళలు..

మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్వాలియర్-షియోపూర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైనుకు ఓ హనుమాన్ గుడి అడ్డంగా మారింది. దీంతో అధికారులు ఏ మాత్రం తడుముకోకుండా వెంటనే హనుమంతుడికి నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఈ నోటీసుల ప్రతి వైరల్ గా మారింది.