Newdelhi, Aug 8: కరోనా (Corona) సమయంలో మూన్ లైటింగ్ (Moonlighting) తో పొందిన అదనపు ఆదాయాన్ని (Extra Income) లెక్కల్లో చూపని ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కరోనా టైంలో అనేక మంది, ముఖ్యంగా టెకీలకు వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో, అనేక మంది మూన్ లైటింగ్ చేస్తూ ఆర్థికంగా లాభ పడ్డారన్న వార్తలు అప్పట్లో సంచలనం కలిగించాయి.
The income tax department has begun issuing notices to professionals who earned more than their regular salary but did not declare the extra income on their tax returns.
Know more👇https://t.co/ov7WrELeE3#ITR #ITRFiling #IncomeTax #ITO
— Moneycontrol (@moneycontrolcom) August 8, 2023
మూన్ లైటింగ్ ద్వారానే ఉద్యోగులు అధిక ఆదాయం పొందినట్టు కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు మొత్తం 1100 నోటీసులను ఐటీ శాఖ జారీ చేసినట్టు సమాచారం. కాగా, ప్రధాన ఉద్యోగానికి తోడు ఖాళీ సమయాల్లో మరో ఉద్యోగం చేయాడాన్ని మూన్‌లైటింగ్ అంటారన్న విషయం తెలిసిందే.