Newdelhi, April 24: మారిన జీవనశైలి (Lifestyle), పనివేళలు (Timings), చిన్న కుటుంబాలు (Small Families) వెరసి చిన్న చిన్న గొడవలకే దంపతులు విడిపోవడం ఈమధ్య సర్వసాధారణంగా అయ్యింది. దంపతులుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీకు.. మీ వివాహాన్ని నిలబెట్టుకునేందుకు మరో అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ విడాకుల కోసం వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగ జంటను (Software Couples) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme court) ప్రశ్నించింది. బెంగళూరులో వేర్వేరు వేళల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు కొన్ని కారణాలతో విడాకుల కోసం సుప్రీం తలుపుతట్టారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
'One works at night, one at day', SC allows dissolution of techie couple's marriage https://t.co/WsaMBTuryc
— OTV (@otvnews) April 24, 2023
''మీకు దాంపత్యానికి సమయమేది? బెంగళూరులో మీ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఒకరు పగలు ఉద్యోగానికి వెళ్తే..మరొకరు రాత్రి వెళ్తున్నారు. విడాకులు తీసుకోవడంపై మీకు విచారంలేదు. అయినప్పటికీ పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి రెండో అవకాశం ఎందుకు తీసుకోరు'' అంటూ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం అడిగింది. ''తిరిగి కలిసుండేందుకు ఈ జంటకు ఓ అవకాశం ఇవ్వాలి'' అని జస్టిస్ నాగరత్న సూచించారు. అయితే ఆ దంపతులు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడానికే నిశ్చయించుకోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.