Newdelhi, April 21: దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు (Politicians), సినీనటులు (Movie Actors) ట్విట్టర్ (Twitter) బ్లూటిక్ (Blue Tick) ను కోల్పోయారు. జాబితాలో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, నటీనటులు సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు. నిన్నటి నుంచే వారి ఖాతాలకు బ్లూ టిక్ కనపడట్లేదు.
SRK, Amitabh Bachchan, Virat Kohli Among Those Who Lost Twitter #BlueTick https://t.co/D9ta1GPjH5
— PUNEET VIZH (@Puneetvizh) April 21, 2023
కారణం ఇదే
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు ఒకలా.. కొనుగోలు చేసిన తర్వాత ఒకలా ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో నిబంధనలు ఉన్నాయి. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు భారతీయ యూజర్లకు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉచితంగా బ్లూటిక్ అందించేది. ఎలాన్ మస్క్ వచ్చాక రూల్స్ మారిపోయాయి. బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే.. సబ్ స్క్రైబ్ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్ తొలగిస్తమని ఇటీవలే ట్విట్టర్ ప్రకటించింది. దీంతో నిన్న అన్నంత పనీ చేసింది. ప్రముఖుల ఖాతాల నుంచి బ్లూటిక్ ఎగిరిపోయింది.