File Image of Vizag Steel Plant (Photo-Twitter)

Vizag, April 21: విశాఖ ఉక్కు పరిశ్రమ (Vizag Steel Plant) కోసం.. అవసరమైతే, స్టీల్ ప్లాంట్ టెండర్లలో (Tender) పాల్గొంటామని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు (Telangana Government) చివరి నిమిషంలో ఉసూరుమనిపించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈ వోఐ-EOI) దాఖలుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. కానీ గురువారం మధ్యాహ్నం గడువు ముగిసే వరకు సింగరేణి సంస్థ తరపున ఎలాంటి బిడ్ దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)లకు ఆహ్వానం పలకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాంట్ కోసం మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కార్మిక నేత అయోధ్య రామ్ స్పందించారు. 7 విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్టు సమాచారం లేదని తెలిపారు.

Poonch Attack: పూంచ్ దాడి మా పనే.. ప్రకటించిన జైషే మహ్మద్.. ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు.. గ్రనేడి దాడి కారణంగానే వాహనంలో మంటలు.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు

కేంద్రాన్ని కోరి అంతలోనే..

తమ సంస్థ బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కేంద్రాన్ని కోరింది. సింగరేణి రిక్వెస్ట్ మేరకే ఈనెల 15వ తేదీనే ముగియాల్సిన టెండర్ల దాఖలు ప్రక్రియ గడువును ఐదు రోజులు పెంచారు. బిడ్ దాఖలుపై సింగరేణి ఉన్నతాధికారులు రెండు, మూడు రోజులుగా వైజాగ్ లోనే మకాం వేసి అవసర మైన ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు బిడ్ దాఖలు చేయలేదు.

Army Vehicle Fire: భారత ఆర్మీ వాహనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం, నలుగురు జవాన్లు సజీవ దహనం అయినట్లుగా వార్తలు, జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన

కేఏ పాల్ తో జేడీ

విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవోఐ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాంట్ మళ్లీ గాడిన పడేందుకు నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఖర్చు చేస్తే చాలని, ఆ మొత్తాన్ని తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించడం చర్చనీయాంశం అయింది. అంతకంటే ముఖ్యంగా, ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో చేయి కలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.