Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు
ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad, April 21: ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన (Sumitra Pampana) ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ (Hyderabad) శ్రీనగర్ కాలనీలో (Srinagar Colony) నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు (Case) నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్ మెంట్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
అటు ఢిల్లీకి వెళ్ళగానే..
ఈ నెల 17న సుమిత్ర ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆమె ఫ్లాట్ తాళాలను అదే అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్న సోదరుడు విజయ్ కుమార్‌కు ఇచ్చారు. అదే రోజు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు 293 గ్రాముల వెండి వస్తులను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతి రోజు ఉదయం దొంగలు పడిన విషయాన్ని గుర్తించిన సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్ ఢిల్లీలో ఉన్న ఆమెకు సమాచారం అందించారు.
(The above story first appeared on LatestLY on Apr 21, 2023 09:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

